ఒకప్పుడు నలుగురు స్నేహితులు. నలుగురికీ చదువు అంటే అస్సలు ఇష్టం లేదు. నలుగురూ రాత్రంతా పార్టీ చేసుకునేవారు. పరీక్ష తొలిరోజు కూడా పార్టీ చేసుకున్నారు. అందుకే టీచర్ దగ్గరికి వెళ్లి అబద్ధం చెప్పి తర్వాత పరీక్ష పెట్టమని అడగాలి అనుకున్నారు. పార్టీ అయ్యాక మరుసటి రోజు నలుగురూ టీచర్ దగ్గరకు వెళ్లి టీచర్‌ తో అబద్ధం చెప్పడం మొదలు పెట్టారు. ఎం అబద్ధం చెప్పాలో ముందుగానే నలుగురూ ఆలోచించుకున్నారు. ముందుగా అనుకున్నట్టుగానే టీచర్ దగ్గరకు వెళ్లి “నిన్న రాత్రి మేము పెళ్లికి వెళ్ళాము. పెళ్లికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా మా కారు టైరు పంక్చర్ అయింది... కారులో టైర్లు ఎక్కువగా లేకపోవడంతో తోసుకుంటూ ఇంటికి తీసుకురావాల్సి వచ్చింది. నిన్న రాత్రి బాగా అలసిపోయాం, ఈరోజు పరీక్షలు రాయలేము. కాబట్టి మేము తర్వాత పరీక్ష రాయవచ్చా?" అని అడిగారు.
 
టీచర్ వాళ్ళ మాట విని బాగా అలోచించి "మీరు రేపు పరీక్ష రాయవచ్చు" అని చెప్పారు. ఇది విన్న నలుగురూ చాలా సంతోషించారు. టీచర్ కు వాళ్ళు అబద్ధం చెబుతున్నట్టుగా అర్థమైంది. మరోవైపు ఆ నలుగురు ఇంటికి వెళ్లి చదువుకోవడం ప్రారంభించాడు. రెండో రోజు పరీక్ష రాయడానికి నలుగురూ వచ్చారు. ఉపాధ్యాయులు వారిని వివిధ తరగతి గదుల్లో కూర్చోబెట్టారు. చేతికి ప్రశ్న పత్రం ఇచ్చారు. ఆ ప్రశ్నల పత్రంలో ఆశ్చర్యకరంగా కేవలం 2 ప్రశ్నలు మాత్రమే ఉన్నాయి.

అందులో మొదటి ప్రశ్న మీ పేరు ఏమిటి ?
రెండవది ఏ కారు టైరు పంక్చర్ అయింది?
రెండవ ప్రశ్నకు నలుగురూ నాలుగు రకాల సమాధానం రాశారు. వాళ్ళు చెప్పింది అబద్ధం కాబట్టి నలుగురి సమాధానాలు భిన్నంగా ఉన్నాయి. ఈ విధంగా టీచర్ వాళ్ళు అబద్ధాలు చెప్పినట్టు నిరూపించింది. అసలు విషయం బయటకు తెలియడంతో వాళ్ళ పేరెంట్స్, క్లాస్ మేట్స్ దగ్గర తల దించుకోవాల్సి వచ్చింది వారికి.

 మోరల్ : జల్సాల కోసం చదువుని అశ్రద్ధ చేయొద్దు... అబద్దాల పరిణామం ఇలాగే నలుగురిలో పరువు పోయేలా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: