సాధారణంగా స్థూలకాయం అనేది ఈ కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ,vప్రతి ఒక్కరిని పట్టిపీడిస్తోంది. ఈ స్తూలకాయం కారణంగా ఎంతోమంది ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూనే , దైనందిక జీవితంలో సంతోషంగా జీవితాన్ని గడపలేకపోతున్నారు. ఇక ఈ అధిక బరువును తగ్గించుకోవడం కోసం ప్రతిరోజూ ఆసనాలు వేస్తూ, వాకింగ్ చేస్తూ, జిమ్ సెంటర్ల కు వెళుతూ.. ఇలా నానా తంటాలు పడుతూ బరువును తగ్గించుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు.అంతే కాదు మరి కొంతమంది అయితే తీసుకునే ఆహారంలో కూడా.. సరైన డైట్ ను ఫాలో అవుతూ బరువు తగ్గించుకోవాలని, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకపోతే ఇప్పుడు చెప్పబోయే ఒక్క కాయ తింటే చాలు బరువు తగ్గిపోవచ్చు అని అంటున్నారు వైద్యులు.. ఇప్పటి వరకు మీరు చేసిన పనులు అన్ని పక్కన పెట్టేసి, ఇప్పుడు చెప్పబోయే చిట్కాను పాటించి చూడండి ..అతి తక్కువ సమయంలో ని రెండు నుంచి మూడు కిలోల బరువు తగ్గవచ్చని సూచిస్తున్నారు.. అదేమిటో ఇప్పుడు మనం కూడా ఒకసారి చూసి తెలుసుకుందాం..

ఆ కాయ ఏదో కాదు..అవకాడో.. దీనిని బటర్ ఫ్రూట్ అలాగే వెన్న పండు అని కూడా పిలుస్తూ ఉంటారు. మన భారత దేశంలో ఇటీవల ఈ కాలంలో అందుబాటులో ఉంటోంది. కాలిఫోర్నియాలో పండించే ఈ రకం దాదాపుగా 80 రకాల గా పండిస్తున్నారట. చూడడానికి గుడ్డు ఆకారంలో ఉండి,  మంచి రుచి, రంగుతో ఉండడం వల్ల దీనిని ప్రతి ఒక్కరు తినడానికి అలాగే జ్యూస్ రూపంలో తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాదు ఈ పండుతో అనేక రకాల వంటలను కూడా తయారు చేసుకోవచ్చు.ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో..? అలాంటి ప్రతి ఒక్కరు దీనిని రోజూ తినే ఆహారంలో ఒక భాగంగా చేర్చుకోవడం వల్ల, అతి తక్కువ సమయంలోనే బరువు తగ్గవచ్చని సూచిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా అవకాడో లో ఎక్కువ మొత్తంలో అమైనో ఆసిడ్స్ ఉంటాయి కాబట్టి, ఇవి మనకు సరిగ్గా జీర్ణం అయ్యేటట్టు చేస్తాయి. కాబట్టి తిన్న ఆహారం సరిగా జీర్ణం అవుతుంది.. అప్పుడు అధిక బరువు నుంచి కూడా విముక్తి పొందవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: