చెమట అనేది చాలా సర్వ సాధారణం.ఇందులో ముఖ్యంగా నీరు, లవణాలు, క్లోరైడ్స్ తో కలిసి ఉంటుంది.మన శరీరంలో కొన్ని భాగాల్లో చెమట ఎక్కువగా పడుతుంది. తల, బాహు మూలలు, ముఖంలో స్వేద గ్రంథులు ఎక్కువగా ఉండడం వల్ల ఈ ప్రదేశాల్లో చెమట ఎక్కువగా పడుతుంది. ప్రతి ఒక్కరికి చర్మంపై స్వేద గ్రంథులు ఉంటాయి. వీటి ద్వారా చెమట బయటకు వస్తుంది. చెమట నీటి రూపంలో బయటకు వస్తుంది. మన శరీరంలో అంత నీరు ఎక్కడ ఉంది అని చాలా మంది అనుకుంటారు. మనం తాగిన నీరు ఇంకా ఇతర ద్రవ పదార్థాలే స్వేద గ్రంథుల నుండి చెమట రూపంలో బయటకు వస్తాయి.మన శరీరంలో గాలి తగలని ప్రదేశాలు చాలా ఉన్నాయి. వాటి నుండి కూడా దుర్వాసన ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ దుర్వాసనను తగ్గించడానికి ఆ భాగాల్లో బేకింగ్ సోడా, నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని రాయాలి. ఇలా చేయడం వల్ల దుర్వాసన తగ్గుతుంది.


పుదీనా ఆకులను పేస్ట్ లా చేసి దుర్వాసన వచ్చే చోట రాస్తూ ఉండడం వల్ల కూడా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఈ టిప్స్ పాటించడం వల్ల చెమట నుండి వచ్చే దుర్వాసనను తగ్గించుకోవచ్చు.చెమట నుండి వచ్చే దుర్వాసనను తగ్గించుకోవడానికి గానూ ముందుగా ఒక గిన్నెలో పెరుగును తీసుకుని అందులో శనగపిండి వేసి పేస్ట్ లా చేయాలి. ఈ పేస్ట్ ను శరీరానికి రాసుకోవాలి. ఈ మిశ్రమం ఆరిన తరువాత స్నానం చేయాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేయడం వల్ల శరీర దుర్గాంధాన్ని నివారించుకోవచ్చు. అలాగే గంధం పొడి, పసుపు, కుంకుమ పువ్వు, కర్పూరాన్ని తీసుకుని పొడిగా చేయాలి. ఈ పొడికి కొద్దిగా నీటిని కలిపి పేస్ట్ లా చేయాలి. ఈ పేస్ట్ ను శరీర బాహూ మూలల్లో రాయాలి.కాబట్టి ఖచ్చితంగా పైన చెప్పిన టిప్స్ పాటించండి. చెమట పోసినప్పుడు ఖచ్చితంగా ఈ దుర్వాసన అనేది తగ్గిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: