పులుగోరు ని పూర్వం రాజులు ఎక్కువ గా మెడలో వేసుకునే వాళ్లు రాజులు పులిని చంపి వాటి గోళ్ల ను పీకి తమ రాజసాన్ని పౌరుషాన్ని ఇతరులకు తెలియజేసే లాగా పులిగోళ్ల ని మెడలో వేసుకునే వాళ్లు. తాము పులిని చంపి అంత ధైర్యం బలం కలిగిన వారని ఇతరులకే చెప్పుకొనే విధంగా పులిగోళ్ళూ ధరించే వాళ్లు.  రాజుల కాలం అంతరించిన తరువాత కూడా చాలా మంది పెద్దమనుషుల్లో పులిగోళ్ల ను వేసుకునే వాళ్లు.



అయితే చాలా మంది పులిగోళ్ల ని ఎవరు పడితే వాళ్లు వేసుకోకూడదని కేవలం సింహరాశి వాళ్లే లేదా సింహ నక్షత్రం లో పుట్టినవాళ్లు మాత్రమే పులిగోళ్ల ను ధరించాలి అని చెబుతూ ఉంటారు. కానీ మన తాళపత్ర ప్రకారం పులిగోళ్ల ను ఎవరైనా వేసుకోవచ్చు కానీ అది నిజంగా పులిగోరు అయి ఉండాలి బయట నకిలీ పులిగోళ్ల కి చాలా మంది వేలు లక్షలు పెట్టి మరీ కోంటుంటారు కానీ అది నిజమైన పులిగోళ్లు అయి ఉండవు.


నిజమైనప్పుడు పులిగోళ్లు కావాలంటే కోయదొరల దగ్గర కోయ పూజారుల దగ్గర అడవిలో నివసించే గ్రామస్తుల దగ్గర మాత్రమే నిజమైన పులిగోళ్లు దొరుకుతాయి. వాళ్లు వాటికి పెద్ద గా ధర కూడా తీసుకోరు కేవలం వెయ్యి రూపాయల లోపు మాత్రమే వాటిని ఇస్తారు. పులిగోళ్ల ను ధరించడానికి ముఖ్య కారణం ఏమిటంటే పులిగోరు మెడలో ఉన్న వారి పై ఎటువంటి నరదృష్టి పడదు ఎటువంటి వశీకరణలు పని చేయవు ఎటువంటి చేతబడి కూడా పనిచేయదు అందుకే పులిగోళ్ల ను పెద్దపెద్దవాళ్లు ధరిస్తూంటారు. కానీ  నరదృష్టి వంటి మూఢనమ్మాకాల కోసం పులి ప్రాణాలు తీయడం అవసరమా??


మరింత సమాచారం తెలుసుకోండి: