ప్ర‌స్తుత స‌మాజంలో ఎంత పెద్ద స్థాయిలో, పదవుల్లో ఉన్నప్పటికీ, సమాజంలో తరతరాలుగా పట్టిపీడిస్తున్న వరకట్న విష జ్వాలలకు మాత్రం మహిళలు ఆహుతికాక తప్పటం లేదు. యుగాలు గడిచే కొద్దీ పురుషుడు స్త్రీ ధనం మీద ఆధారపడ సాగాడు. ఆ ప్రయత్నంలో అధనపు కట్నం కోసం భర్త అత్తమామలను వేధించడం, భార్యను హింసించడం ఎక్క‌డిక‌క్క‌డ జ‌రుగుతూనే ఉన్నాయి.  1990 దశాబ్దం వరకూ భారత మహిళలను ఎన్నో రకాలుగా వేధిస్తున్న వరకట్న సమస్య ఇప్పుడు కాస్త తగ్గింది. అయితే తర్వాతి కాలంలో వరకట్నాన్ని నేరంగా పరిగణిస్తూ చట్టం రూపొందించింది న్యాయస్థానం. అయినా ఈ దురాచారం పూర్తిగా సమిసిపోలేదు. 

 

ఇప్పటికే పెళ్లి సమయంలో వధువు కుటుంబం నుంచి ఏదో ఓ రూపంలో ప్రతిఫలం ఆశిస్తూనే ఉన్నారు వరుడు, అతని కుటుంబసభ్యులు. వరకట్న వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆడవాళ్లు, అదనపు కట్నం తేలేదని అత్తింటివారి చేతుల్లో ప్రాణాలు కోల్పోతున్న మహిళళు చాలామందే ఉన్నారు. ఇక తాజాగా తన భర్త మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకుని, తనను వేధిస్తున్నాడని తమిళ నటి రమ్య బెంగళూరు, కోడిగేహళ్లి పోలీసులను ఆశ్రయించింది. 

 

ఆమె ఫిర్యాదు ప్రకారం, అదనపు కట్నం తీసుకురావాలని భర్త వరదరాజన్ వేధిస్తున్నాడు. 2017లో తనకు డ్యాన్స్ మాస్టర్ గా ఉన్న వరదరాజన్ తో వివాహం జరిగిందని, ఆ సమయంలో ఇంటి స్థలం, బంగారం, ఆభరణాలు, డబ్బును కట్నంగా ఇచ్చామని చెప్పింది. 'వరదరాజన్‌ డ్యాన్స్‌ అకాడమీ'ని స్థాపించాలని భావిస్తున్న తన భర్త, అందుకు కావాల్సిన డబ్బులు తెచ్చివ్వాలని తన వెంట పడ్డారని రమ్య ఆరోపించింది. అలాగే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను హింసిస్తున్నాడని తెలిపింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ ప్రారంభించారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: