డయాబెటీస్ ఉన్న వాళ్ళు కొన్ని పదార్థాలు తినకూడదు అని అంటారు.. అయితే నాన్ వెజ్ తినవచ్చా లేదా అని చాలా మంది ఆలోచిస్తారు. ముఖ్యంగా మటన్ తీసుకోవడం వల్ల ఏదైనా నష్టాలు ఉన్నాయా లేదా లాభాలు ఉన్నాయా అనే విషయాల గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.. కొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాలను పూర్తిగా మానేస్తారు. కానీ నిజానికి అలా చేయాల్సిన పనిలేదు. డయాబెటిస్ నియంత్రణలో ఉన్నవారు ఏ ఆహారాన్ని అయినా సరే మితంగా తీసుకోవాలి. అంటే తక్కువ మోతాదు లో తీసుకోవాలి. దీని వల్ల ఎలాంటి సమస్యలు రావు.



ఇక డయాబెటిస్ ఉన్నవారు అన్నీ రకాలా నాన్ వెజ్ లను తీసుకోవచ్చును.. అయితే ఉన్న దానికన్నా కూడా తక్కువ తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. అమెరికా నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ చెబుతున్న ప్రకారం డయాబెటిస్ ఉన్నవారు మటన్‌ను పూర్తిగా మానేస్తే మంచిది. ఎందుకంటే అందులో శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. ఇది అస్సలు మంచిది కాదు. దీని వల్ల డయాబెటిస్ లేని వారిలో ఆ వ్యాధి వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది.. అంతేకాదు కొవ్వు అధికంగా శరీరంలో పేరుకు పోతుంది. దాంతో పాటుగా హార్ట్ స్ట్రోక్ కూడా వస్తుందని అంటున్నారు. మటన్ లో ఉంటే ఫ్యాట్ వల్ల శరీరానికి ఇంకా కొవ్వు వస్తుందని, అందువల్ల చికెన్ లాంటి వేడి వస్తువులను తీసుకోవడం మంచిదని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు..



అయితే ఇనిస్టిట్యూట్ చెప్పినప్పటికీ మటన్‌ను పరిమితంగా తీసుకుంటే ఏమీ కాదని, డయాబెటిస్ నియంత్రణ లో ఉన్నవారు అందుకు కంగారు పడాల్సిన పనిలేదని వైద్య నిపుణులు అంటున్నారు. అయినప్పటికీ భయం చెందే వారు మటన్‌కు బదులుగా చికెన్‌, చేపలను తినవచ్చని, వాటిల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది కనుక నిర్భయంగా వాటిని తీసుకోవచ్చని  చెబుతున్నారు.. ఏదైనా కూడా లిమిట్ గా తీసుకోవడం వల్ల మంచిగానే ఉంటుంది.. ఎక్కువగా తీసుకుంటే అన్నీ నష్టాలే..

మరింత సమాచారం తెలుసుకోండి: