కాలం మారింది అనే కంటే కరోనా మార్చింది అనటం సబబు. అలాగే అలవాట్లు మారాయి వాటి ద్వారా జరిగే పొరపాట్లు కూడా అగచాట్లుగా మారుతున్నాయి. అలాంటి సందర్భాలను వయసు రీత్యా సీనియర్ సిటిజెన్స్ అయినా హృదయంలో యువరక్తం ప్రవహించే కొందరు తమ ట్వీట్ల ద్వారా సరదా సన్నివేశాలుగా మార్చేస్తూ చదువరులను, వీక్షకులను మురిపి స్తున్నారు, మైమరపిస్తున్నారు.


కరోనా పుణ్యమా అని వీడియో కాన్ఫరెన్స్‌లు బాగా పెరిగిపోయాయి. వీటివల్ల కొన్నిచోట్ల చిత్ర విచిత్రాలు జరిగి జనాలను తెగ నవ్విస్తున్నాయి. అందుకు చిన్న ఉదాహరణ ఇది. 


అసలే “వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌” - ఒక ఉద్యోగి తన బాస్‌ తో వీడియో కాన్ఫరెన్స్‌ లో ఏదో సీరియస్‌ గా మాట్లాడుతున్నాడు. ఈ లోపు సీన్‌ లోకి సడన్‌గా ఆయన భార్య వచ్చింది. భర్త ఇంట్లో, భార్య వంటింట్లో, పిల్లలు చదువుల్లో - ఛాన్స్ దొరికిందో! లేక చిలిపిగా తీసుకుందో ఓ చిలిపి భార్యకు చిలిపి ఊహ మదిలో సందడి చేసిందో ఏమో! భర్త గారిని ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేసింది. కోరి కోరి భార్య ముద్దిస్తుంటే ఏ భర్త అయినా వద్దంటాడా? కానీ ఆ భర్త వద్దన్నాడు. పైపెచ్చు తీవ్రంగా మండిపడ్డాడు.



‘కెమెరా ఆన్‌ లో ఉంది. వాట్‌ నాన్‌సెన్స్‌ యూ ఆర్‌ డూయింగ్‌’ అని ఇంటి పై కప్పు లేచిపోయేలా ధరణి దద్దరిల్లేలా అరిచాడు. అప్పుడు గానీ భార్యకు మ్యాటర్‌ అర్థం కాలేదు. ఈ వీడియోను “ఆర్‌పీజీ గ్రూప్‌ చైర్మన్‌ - హర్ష్‌ గోయెంక” సరదాగా షేర్‌ చేశాడు. ఈ వీడియోను చూసి “మహీంద్ర గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్ర” మరింత సరదాగా స్పందించాడు.. ఎలా అంటే ”ఈ మహిళను వైఫ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ గా నామినేట్‌ చేస్తున్నాను" అని రీట్వీట్ చేశారు.




ఈ ఇద్దరు క్షణం తీరిక ఉండని పారిశ్రామికవేత్తలే. కానీ మనసు రీత్యా యువకులే కావచ్చు. అయినా మన నందమూరి తారక రామారావు తన దాన వీర శుర కర్ణ లో - చిత్రం భళారే విచిత్రం - అనే సినిమా పాటలో  "ఎంతటి మహారాజైన ఎపుడో ఏకాంతంలో, ఎంతో కొంత తన కాంతను స్మరించుటే విచిత్రం' అన్న విధంగా ఈ యువ ఐటి కపుల్ సంఘర్షణ చూసి - వారి మదిలో కూడా, వారి వారి కాంతలు చిలిపి సందడి చేస్తూ మేదిలుంటారు కావచ్చు!  అయినా సేన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి - వయసుతో పనేంటి?  అందుకే ట్వీట్లు - రీట్వీట్లు చెలరేగి పోయాయి.  




వర్క్ ప్రెషర్తో తన్నుకులాడే యువకునికి వద్ద పాపం! తన భార్య చిలిపి ఆలోచన ..... వర్కవుట్ కాలేదు ....హెన్స్ .... మూడాఫ్! - కానీ మేనేజ్మెంట్ తెల్సిన ఈ మానసిక యువకులకు ..... వారి భార్యాలు మదిలో మెదిలి .... మూడాన్!   ..... "వాహ్!  వారేవా!  క్యా సీన్ హై !" అంటున్నారు  నెటిజెన్స్ మదిలో.కేరింతలు! అయితే ఆమె హస్బెండ్ ఒప్పుకుంటే వారిద్దరిని "కపుల్ ఆఫ్ ది ఇయర్" గా నామినేట్ చేస్తానని ముక్తాయింపుగా నవ్వారు ఆనంద్. దట్స్ ఇట్.



మరింత సమాచారం తెలుసుకోండి: