హోమ్ స్టేజింగ్ అంటే ఒక ప్రాపర్టీని ఎంతో అందంగా అలంకరించి, ఆ ప్రాపర్టీని కొనడానికి వచ్చేవారు, ఆ ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుందో అని అనిపించేలా తీర్చిదిద్దడం. సాధారణంగా ఈ హోమ్ స్టేజింగ్ అనేది అమెరికా, యూరప్ లో ఎప్పటినుండో పాపులర్.. అయినప్పటికీ ఇండియాలో ఇప్పుడిప్పుడే ప్రజాదరణ పొందుతోంది. అయితే ఇక్కడ హోమ్ స్టేజింగ్ చేయడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ముందుగా మెయిన్ ఏరియాస్ మీద ఫోకస్ చేయడం:
అంటే ఇంట్లో బాగా ముఖ్యమైన రూమ్స్ ఏముంటాయి.. లివింగ్ రూమ్, బెడ్రూమ్, కిచెన్ అంతే కదా ! అంటే వీటిని కొనడానికి వచ్చే వాళ్ళు కూడా ముందు ఈ విషయంలో సంతృప్తి చెందితేనే, ఇతర విషయాల గురించి ఆలోచిస్తారు. ఈ  రూమ్స్ లో ఆర్కిటెక్చర్, ఇంటీరియర్స్ బాగా ఆకట్టుకునేలా ఉండేలా చూడడం అత్యవసరం. అప్పుడే కొనుగోలుదారులను ఆకట్టుకునేలా ఉండడంతో పాటు వారిని త్వరగా ఆకర్షిస్తాయి..

అందరికీ నచ్చేలా డిజైన్ చేయడం:
హోమ్ స్టేజింగ్ చేసేటప్పుడు పర్సనల్ టచ్ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇంటిని చూడడానికి వస్తారు. వారికి ఈ టెస్ట్ ఉండకపోవచ్చు.. ఉండవచ్చు.. కాబట్టి.. సింపుల్, న్యూట్రల్ అప్పీల్ ఉండేలా చూసుకోవడం చాలా అవసరం..

మీ ఇంటికి మంచి వ్యూ  ఉండేలాగా చూసుకోవాలి:
ఇంట్లో నుండి బయటకు చూస్తున్నప్పుడు ఏం కనిపిస్తుంది అనేది ఇంపార్టెంట్ పాయింట్. మీ ఇంటి బెడ్ రూం నుండి బయటకు చూస్తే, కిటికీ బయట మంచి గార్డెన్ లేదా వీలైతే మంచి ఆహ్లాదకరమైన ప్రదేశాలు ఉండేలా చూడాలి..

బయట కూడా ఆహ్లాదకరంగా ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే ఇంటి ని కొనడానికి వచ్చే వారు, ఇంటి చుట్టూ కూడా చూస్తారు. ఇంటి బయట ఎంత చక్కగా ఉందో అన్నదాన్ని బట్టి ఇంటి లోపల ఎలా ఉంటుందో?  ఇంట్లోకి అడుగు పెట్టకుండానే ఒక అంచనాకు వస్తారు. అందుకే ఇంటి చుట్టూ ఆహ్లాదకరంగా, మంచి గార్డెన్స్ చుట్టూ చెట్లు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఇంటికి మంచి కలర్ ఫుల్ పెయింటింగ్స్ వేయడం కూడా అత్యవసరం..



మరింత సమాచారం తెలుసుకోండి: