వీకెండ్ విండో  : పుస్త‌కం చ‌దువుతారా ఫ్రెండ్

కొన్నే అక్ష‌రాలు
ఎన్నో విప‌త్తుల‌కు ప‌రిష్కారాలు

మ‌నంత‌ట మ‌నం తెరవ‌నివి
తెర వెనుక ఉన్న‌వి
ఊహకు అంద‌నివి అన్నీ పుస్త‌కం
ఇస్తుంది.. పుస్తకం నేర్పుతుంది

డిజిట‌ల్ యుగంలో పుస్త‌క‌మా
అవును! డిజిట‌ల్ యుగంలోనే పుస్త‌కం
మార్చి రాయండి.. ఇప్పుడు ఇలాంటి నేస్తాల అవ‌స‌రం
ప్రాధాన్యం గుర్తించండి.. చెడిపోయేందుకు ద‌గ్గ‌రగా ఉండ‌కండి

కొత్త పుస్త‌కాలు ఏమ‌యినా అమ్ముడు పోవ‌డం లేదు.. పాత పుస్త‌కాలు సంచుల కొద్దీ పోగ‌యి ఉన్నాయి.. కొత్త‌గా వంశీ అదేలేండి డైరెక్ట‌ర్ వంశీ పొల‌మారిన జ్ఞాప‌కాల పేరిట పుస్త‌కం వేశాడు. ఇంకా ఇంకొన్ని వ‌చ్చాయిలేండి..మ‌న ద‌రిద్రం ఏంటంటే ఇప్పుడున్న పుస్త‌కాల్లో ఏది మంచో ఏది చెడో చెప్ప‌లేక‌పోవ‌డం.. మ‌న‌కు యాప్ రేటింగ్స్ ఇచ్చినంత సులువుగా పుస్త‌కాలు రేటింగ్ ఇవ్వ‌డం చేత‌కాదు. అందుకు చింతించండి..అందుకు బాధ‌ప‌డండి.. కానీ మ‌నం ఎంత వెనుక‌బాటులో ఉన్నా మంచి పుస్త‌కం మాత్రం ఆ వెనుక‌బాటునూ ఆ నిరాస‌క్త‌త‌నూ వెన‌క్కు పోయేలా చేస్తుంది. ఇప్పుడు పుస్తకాలను వ‌దిలేసి కంప్యూట‌ర్ల‌పై, ఇంకొన్ని డిజిటల్  స్క్రీన్స్ పై మోజు పెంచుకుంటున్న మ‌నం ఒక్కసారి ఈ వారాంతం మంచి పుస్త‌కానికో విలువ ఇద్దాం. లేదా మంచి పుస్త‌కం నుంచి మ‌రో మంచి విష‌యం తెలుసుకుందాం. మ‌నం ఎలా ఉన్నా కొన్ని గ్రంథాల‌యాలు మాత్రం అదే ప‌నిగా త‌మ ప‌ని తాము చేసుకుపోతున్నాయి. అందుకు శ్రీ‌కాకుళం జిల్లా కేంద్ర గ్రంథాల‌య‌మే ఉదాహ‌ర‌ణ. ఇక్క‌డ అందుబాటులో ఉండే పుస్త‌కాల‌ను డిజిట‌లైజ్ చేసి క్యాట‌లాగ్ రూపొందిస్తున్నారు. ఇప్ప‌టిదాకా తెలుగు భాష‌కు సంబంధించి 16153 పుస్త‌కాల వివ‌రాల‌ను డిజిట‌లైజ్ చేశారు. జిల్లాలో  ఉన్న అన్ని శాఖా గ్రంథాల‌యాలు కూడా ఇదే ప‌నిలో ఉన్నాయి. క్యాట‌లాగ్ రూపొందితే మంచి పుస్త‌కాల వివ‌రాలు అందుకోవ‌డం మ‌రింత సులువు అవుతాయి. ఇదే ప్ర‌య‌త్నంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రంథాల‌య పాల‌నాధికారులు ఉండ‌డం విశేషం. పుస్త‌కాల  గురించి తెలుసుకోవ‌డం.. పుస్త‌కం గురించి చెప్ప‌డం రెండూ బాధ్య‌తే క‌నుక ఈ వారాంతం ఇలాంటి మంచి ప‌ని ఒక‌టి త‌ప్ప‌క చేయండి.  మీ ఇంట్లో ఉన్న పుస్త‌కాల క్యాట్ లాగ్ ను మీరే డిజైన్ చేసి ఆన్లైన్ లో ఉంచండి.. ఏం కాదు న‌లుగురికీ ఆ జ్ఞాన సంప‌ద విలువ త‌ప్ప‌క తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: