ఇటీవల కాలంలో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో బయోపిక్ ల హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  బయోపిక్ అంటే నిజ జీవిత సంఘటనల ఆధారంగానే తెరకెక్కుతుంది. దీంతో ఇక ఈ సినిమా కోసం కొత్తగా కథ రాసుకోవాల్సిన అవసరం లేదు.  అదే సమయంలో అటు ప్రేక్షకులు కూడా ఈ మధ్యకాలంలో బయోపిక్ లను బాగా ఆదరిస్తున్నారు.  ఇటీవలి కాలంలో విడుదలైన సినిమాలు కూడా మంచి విజయాలు సాధించాయి. దీంతో బయోపిక్ లు తెరకెక్కించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు దర్శకనిర్మాతలు. ఇప్పటికే ఎన్నో బయోపిక్లో తెరకెక్కాయి.  ఇక మరికొన్ని బయోపిక్ తెరకెక్కుతున్నాయి .



 సినిమా, క్రీడ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల జీవిత చరిత్ర ఆధారంగా సినిమాలు తెరకేక్కుతున్నాయి. అయితే భారత క్రికెట్ చరిత్రలో మహిళా క్రికెటర్ గా ఎన్నో రోజుల పాటు సేవలందించిన మిథాలీ రాజ్ జీవిత చరిత్ర కూడా తెరకెక్కుతోంది. భారత మహిళా జట్టు కెప్టెన్గా వ్యవహరించిన మిథాలీ రాజ్ తన ఆటతో జట్టుకు ఎన్నో విజయాలను అందించారు. ఇక ఇటీవలే మిథాలీ రాజ్ బయోపిక్ తెరకెక్కించేందుకు అంగీకరించడంతో ఈ సినిమా కాస్త మరికొన్ని రోజులు పట్టాలెక్క పోతుంది  . ఇకపోతే ఈ సినిమా కి 'శభాష్ మిథు' అనే ఒక టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.  ఇక ఈ సినిమాకు రాహుల్ ధోలాకియా దర్శకత్వం వహించి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.



 కానీ ఇటీవలే ఇక మిథాలీ రాజ్ బయోపిక్ ప్రాజెక్టు లో మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఈ సినిమాని తెరకెక్కించేందుకు రాహుల్ దోలాకీయ అనుకున్నప్పటికీ అతని స్థానంలో బెంగాలీ డైరెక్టర్ శ్రీజిత్ ముఖర్జీ దర్శకుడిగా  వ్యవహరించ పోతున్నాడట  . అయితే ఇంత సడన్గా దర్శకుడిని మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది అనే విషయం మాత్రం కారణాలు తెలియాల్సి ఉంది. కాగా ఇప్పటికే వైవిధ్యమైన పాత్రలో నటించి మెప్పిస్తుంది తాప్సీ. మిథాలీ రాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో మిథాలీ  పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమా కోసం తాప్సీ ఇప్పటికే ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: