స్టార్ హీరోలలో కొందరు  తమ స్టార్ డమ్ కి  భిన్నమైన  పాత్రల్లో   కనిపించి.. సూపర్ హిట్ అందుకున్న హీరోలు  కొందరు ఉన్నారు. వారెవరో చూద్దాం.  సూపర్ స్టార్ మహేష్ బాబు -    మహేష్‌ తన ఇమేజ్‌ కి ఏ మాత్రం సంబంధం లేని  'నాని' సినిమాలో నాని పాత్రను పోషించి  అభిమానులకు షాక్ ఇచ్చాడు.  ఆ తర్వాత చేసిన  "బిజినెస్‌మ్యాన్"లోని సూర్య పాత్ర కూడా మహేష్ ఇమేజ్ కి పూర్తి విరుద్ధమైనదే.   మహేష్ కూడా  తన స్టైల్ ను  పక్కనపెట్టి  సూర్య పాత్రతో  ఆకట్టుకున్నాడు.

 జూనియర్ ఎన్టీఆర్ -   వరుస ప్లాప్ ల పరంపరలో పడి  తారక్  మిక్కిలి నిరాశకు లోనైన రోజులు అవి.  అప్పుడే వచ్చింది  "టెంపర్" కథ. తన స్టార్ డమ్ కి సరిపడని పాత్ర అది.  కానీ  తారక్ ఎక్కువ ఆలోచించలేదు. దయా పాత్రతో  ఎన్టీఆర్ గొప్ప  ఇంపాక్ట్  ఇచ్చాడు.  ఆహార్యం మారింది, నటన మారింది, ఆ నెగిటివ్ పాత్రలో  సంపూర్ణ  నటుడిగా ఎదిగి  మళ్ళీ ప్లాప్ అనేది దరికి చేరకుండా   తారక్  తన కెరీర్ ను కొనసాగిస్తున్నాడు.

ప్రభాస్ - "బుజ్జిగాడు" సినిమాకి ముందు ప్రభాస్ అంటే.. సీరియస్ హీరో. దానికి తగ్గట్టుగానే ప్రభాస్ కూడా అప్పటివరకూ యాక్షన్ చిత్రాలే ఎక్కువగా చేశాడు. కానీ. ప్రభాస్‌ కూడా నవ్వించగలడు, ప్రభాస్ లో కూడా గొప్ప కామెడీ యాంగిల్ ఉందని నిరూపించిన పాత్ర "బుజ్జిగాడు"నే. ముఖ్యంగా ఈ సినిమా నుండే ప్రభాస్ కి అభిమానగణం పెరిగింది. ముఖ్యంగా అమ్మాయిలలో ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది.
 
అల్లు అర్జున్ -  ఎనర్జిటిక్ పాత్రలకు పేరు మోసిన  బన్నీ  "వేదం" సినిమాలో తన  ఎమోషనల్  పాత్రతో   కళ్ళు చెమ్మగిల్లేలా చేశాడు. ఆ సినిమాలో బన్నీ  పాత్రని  ప్రతి  ప్రేక్షకుడు   గుర్తుంచుకుంటాడు. ఎందుకంటే బన్నీ చేసిన  "కేబుల్ రాజు" అనే పాత్రే  ఎప్పటికీ వైవిధ్యమే.  "నా పేరు సూర్య", రుద్రమదేవి వంటి  సినిమాల్లో  కూడా బన్నీ  కొత్త పాత్రలు చేసి మెప్పించాడు.      

 యంగ్  హీరోల విషయానికి వస్తే.. వరుణ్ తేజ్  'గద్దలకొండ గణేష్'  సినిమాలో నెగటివ్ షేడ్  గ్యాంగస్టర్  పాత్రలో నటించి ఆశ్చర్యపరిచాడు.   అలాగే కామెడీ స్టార్  అల్లరి నరేష్.. 'నేను' సినిమాలో  ఇంట్రావర్ట్  సైకాలాజికల్ క్యారెక్టర్ మరియు  'విశాఖ ఎక్స్ ప్రెస్' సినిమాలో  అతి క్రూరమైన విలన్ గా నటించి  షాక్ ఇచ్చాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: