సినిమా అంటేనే.. ఒక సినిమా ఆలోచింప చేస్తే.. మరొక సినిమా ఆదర్శంగా నిలుస్తుంది.. మరొక సినిమా నవ్విస్తే.. ఇంకొక సినిమా కవ్విస్తుంది.. ఒక సినిమా భయంతో దడ పుట్టిస్తే..మరొక సినిమా భక్తి పారవశ్యంతో ముంచెత్తుతుంది.. అలాంటి సినిమానే అమ్మోరు.. అమ్మోరు పాత్రలో రమ్యకృష్ణ నటించగా.. సౌందర్య ప్రధాన పాత్రలో నటించి తెరకెక్కిన చిత్రం అమ్మోరు. ఈ సినిమాకు మహిళాలోకం నీరాజనాలు పట్టింది. అంతేకాదు థియేటర్ల ముందు ఎంతో మంది మహిళలు అమ్మోరు ఆవహించినట్టుగా , పూనకాలు వచ్చినట్టుగా ప్రవర్తించారు. విడుదలైన మొదటి రోజు నుంచి శతదినోత్సవాలు జరుపుకొన్న ఈ సినిమా గురించి ఇప్పుడు తెలుసుకుందాం..కేవలం ఈ సినిమాలో గ్రాఫిక్స్ కోసమే కోటి 20 లక్షలు రూపాయలు పెట్టి సినిమాను తెరకెక్కించడం జరిగింది. కోడిరామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించాడు. వీరి కష్టం ఎక్కడ వృధా కాలేదు.. ఈ సినిమా విడుదల అయ్యి అత్యంత అఖండ విజయాన్ని అందుకోవడమే కాకుండా.. దర్శకులలో ఇలాంటి టాలెంట్ కూడా ఉందా అని ప్రేక్షకుల చేత ఔరా అనిపించింది. ఈ సినిమా లో సౌందర్య పాత్ర అద్భుతం అంటే రమ్యకృష్ణ పాత్ర మహా అద్భుతం అని చెప్పవచ్చు.. ఒకరికొకరు పోటీపడి మరీ ఈ సినిమాలో నటించడం జరిగింది.ఈ సినిమాలో విలన్ గా గుర్తింపు పొందిన రామిరెడ్డి తన పాత్రకు వందశాతం న్యాయం చేశాడు. ముఖ్యంగా ఈ పాత్ర రామిరెడ్డి తప్ప మరెవరూ చేయలేరో ఏమో అన్నట్లుగా ఆయన పౌరుషం, భయానకం ఈ సినిమాలో ఉట్టిపడేలా చూపించడం గమనార్హం. అంతేకాదు సురేష్ బాబు కూడా ఈ సినిమాలో చాలా బాగా సపోర్టింగ్ ఇచ్చాడు అని చెప్పాలి. ముఖ్యంగా "అమ్మోరుకు బొట్టు పెట్టమ్మా" అంటూ వచ్చే కళ్ళు చిదంబరం డైలాగ్ సినిమాకు హైలెట్ గా నిలిచింది.. సినిమాలో ప్రతి సన్నివేశం.. ప్రతి క్యారెక్టర్ కూడా ఎంతో అద్భుతంగా రాణించాయి. ఈ సినిమాతో సౌందర్య తన సినీ జీవితాన్ని సరికొత్తగా మలుచుకుంది అని చెప్పవచ్చు.




మరింత సమాచారం తెలుసుకోండి: