కొంతమంది హీరోయిన్స్ కి అన్ని సూపర్ క్వాలిటీస్ ఉన్నా సరే లక్ కలిసి రాక పెద్దగా క్రేజ్ సంపాదించుకోరు. సినిమాలు చేస్తున్నా సరే వాటితో తగినంత క్రేజ్ దక్కించుకోవడంలో వెనకపడతారు. అలాంటి వారిలో మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ అదా శర్మ ఉంటుంది. బాలీవుడ్ లో 1920 సినిమా చేసి మొదటి సినిమాతోనే సర్ ప్రైజ్ చేసిన అదా శర్మ తెలుగులో పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో నితిన్ హీరోగా చేసిన హార్ట్ ఎటాక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని కాదనకుండా చేసిన అమ్మడు కెరియర్ లో వెనకపడ్డది.

సినిమాలు చేసినా చేయకపోయినా సోషల్ మీడియాలో మాత్రం అదా శర్మ అదరగొట్టేస్తుంది. ట్విట్టర్, ఇన్ స్టాగ్రాం లలో అదా శర్మ చేసే హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది. అమ్మడి సోషల్ ఫాలోయింగ్ చూసి పలు మేగజైన్ లు కవర్ పేజ్ లకు పోటీ పడుతున్నాయి. లేటెస్ట్ గా అదా శర్మ లుక్స్ పెస్సో మేగజైన్ కి కవర్ పేజ్ స్టిల్ ఇచ్చింది. ఈసారి యాక్షన్ స్టార్ అవతారం ఎత్తింది అదా శర్మ. అమ్మడు తనలోని మల్టీటాలెటెండ్ టాస్క్ లను అన్నిటినీ సోషల్ మీడియా వేదిక ద్వారా బయట పెడుతుంది. ఈమధ్యనే కర్రసాము విద్యని నేర్చుకుంటూ ఆ వీడియోని షేర్ చేసింది.

కల్కి తర్వాత తెలుగులో అవకాశాలు అందుకోని అదా శర్మ షార్ట్ ఫిలింస్ లో నటించింది. ఎప్పుడూ తనని తాను కొత్తగా ప్రెజెంట్ చేసుకోవాలని చూస్తున్న అదా శర్మ తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తుంది. తప్పకుండా అమ్మడు తను కోరుకున్న విధంగా క్రేజ్ తెచ్చుకోవడంలో సఫలం అయ్యిందని చెప్పొచ్చు. ప్రస్తుతం యాక్షన్ మూడ్ లో ఉన్న అదా శర్మ తన మేగజైన్ కవర్ పేజ్ షేర్ చేస్తూ లైట్స్, కెమెరా అండ్ అంటూ క్వశ్చన్ మార్క్ కామెంట్ పెట్టింది. అయితే దీనికి అదా శర్మ ఫాలోవర్స్ లైట్స్, కెమెరా.. అండ్ అదా శర్మ అని కామెంట్స్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: