అల్లు అర్జున్, త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అల వైకుంఠపురములో. గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేఏషన్స్ కలిసి నిర్మించిన ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసింది. బనీ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన అల వైకుంఠపురములో సినిమా వచ్చి ఏడాడి పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆ సినిమాలో పనిచేసిన వారంతా ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

అల్లు అర్జున్ తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం లో అల వైకుంఠపురములో సక్సెస్ మీట్ వీడియోని.. ఆ టీం తో దిగిన ఫోటోలను షేర్ చేయగా ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన పూజా హెగ్దే మాత్రం ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది. ఈ క్రమంలో అల వైకుంఠపురములో ఎక్కువగా ఎంజాయ్ చేసిన సీన్ గురించి అడిగితే అల్లు అర్జున్, సుశాంత్, నివేదాలతో చేసిన సీన్ అని చెప్పింది. అది సినిమాలో లేదని.. కనీసం ఇప్పుడైనా ఆ డిలీటెడ్ సీన్ యూట్యూబ్ లో పెడితే బాగుంటుందని చెప్పింది పూజా హెగ్దే. ఆమె అంతగా చెప్పింది అంటే ఖచ్చితంగా ఆ సీన్ బాగా వచ్చి ఉండొచ్చు.

లెంగ్త్ ఎక్కువై ఆ సీన్ కట్ చేశారేమో కానీ పూజా హెగ్దే కోరిక మేరకు ఇప్పటికైనా ఆ సీన్ ని యూట్యూబ్ లో పెడితే అల వైకుంఠపురములో ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. అల వైకుంఠపురములో సక్సెస్ లో మ్యూజిక్ డైరక్టర్ థమన్ కి ఎక్కువ క్రెడిట్ ఇచ్చేయాల్సిందే. ఆ సినిమాకు థమన్ ఇచ్చిన మ్యూజిక్ నెక్స్ట్ లెవల్ అనిపించింది. సినిమాకు మ్యూజిక్ తోనే సూపర్ హిట్ టాక్ వచ్చేలా చేశాడు థమన్. త్రివిక్రం, అల్లు అర్జున్ కాంబినేషన్ లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల హిట్ తర్వాత హ్యాట్రిక్ మూవీగా అల వైకుంఠపురములో వచ్చింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: