ఈ మధ్య కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ మూగ బొయిన సంగతి తెలిసిందే..గత ఏడాది నుంచి సినిమాల సందడి మొదలైంది. అయితే ఇప్పటి వరకూ వచ్చిన తెలుసు సినిమాలు జనాలను బాగా మెప్పించాయి. కానీ బాలివుడ్ సినిమాలు మాత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయిన సంగతి తెలిసిందే..వరుసగా అక్కడ సినిమలన్నీ ప్లాపులు అవుతున్నాయి. భూల్ భులయ్య 2 సినిమా కాస్త హిట్ అయ్యిందనుకుంటే.. బాలీవుడ్ బిగ్ స్టార్ మూవీ ఒకటి బాక్సాఫీస్ వద్ద అడ్డంగా బోల్తా పడింది. సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ మిస్ యూనివర్స్ మనూషి చిల్లర్ జంటగా నటించిన హిస్టారికల్ ఫిల్మ్ 'పృథ్వీరాజ్'. ఈ చారిత్రాత్మక చిత్రాన్ని యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించారు. చంద్రప్రకాష్ దర్శకత్వం వహించారు.


అత్యంత పరాక్రమ ధైర్య సాహసాలు కలిగి ఢిల్లీని పరిపాలించిన పృథ్వీరాజ్ చౌహాన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది ఈ సినిమా. ఢిల్లీ సామ్రాజ్యంపై అత్యంత క్రూరమైన దండయాత్ర చేసిన మహమ్మద్ ఘోరీ నుండి భారతదేశాన్ని రక్షించడానికి ధైర్యంగా పోరాడిన ఈ పురాణ యోధుని పాత్రలో అక్షయ్ కుమార్ నటించారు. ఈ సినిమా ఇటీవలే జూన్‌ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడదలైన ఈ మూవీ వారానికే బాక్సాఫీసు వద్ద బోల్తా పడిందిన వార్తలు వినిపిస్తున్నాయి.అంతే కాదు థియేటర్లు కూడా జనంతో నిండటం లేదన్నవార్తలు కూడా వస్తున్నాయి..


తాజాగా అక్షయ్ కుమార్ సినిమాకు ఘోర అవమానం జరిగింది. ఈ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లో ప్రేక్షకులు లేకపోవడంతో మూవీ ప్రదర్శనను నిలిపివేసినట్లు బి-టౌన్‌ పత్రికల్లో కథనాలు వస్తున్నాయి.ఈ సినిమాను రూ.300 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు.కానీ,ఇప్పటి వరకూ మాత్రం సినిమాకు కేవలం 55 కోట్లు మాత్రమే వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది.ఇక మూవీపై పెద్దగా టాక్‌ లేని నేపథ్యంలో నేటి షో చూసేందుకు ఒక్కరు కూడా రాకపోవడంతో ఓ థియేటర్లో షోని రద్దు చేశారని సమాచారం. ఇక మరికొన్ని చోట్ల థియేటర్లో ఎక్కువ భాగం సీట్లు ఖాళీగా ఉండటంతో ఇక 'పృథ్వీరాజ్‌' సినిమా ప్రదర్శనను నిలిపివేశారంటూ వార్తలు వస్తున్నాయి.ఇక ఈ సినిమా కనిపించదని తెలుస్తుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: