తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి వివాదాలకు నోచుకోని హీరోయిన్ ఎవరంటే సాయి పల్లవి అని చెప్పవచ్చు. అయితే గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచే ఈమె పేరు ఎక్కువగా వినిపిస్తున్నది. అదేమిటంటే విరాట పర్వం సినిమా ప్రమోషన్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చాలా వైరల్ గా మారుతున్నాయి. మతం కంటే మానవత్వం చాలా గొప్పది అనే ఉద్దేశంతో కాశ్మీర్ పైల్స్ సినిమాలో చూపించిన పండితులు చంపడం కరోనా సమయంలో గోరక్షణ పేరుతో వాటి పైన జరిగిన దాడులను ఉదాహరణగా తెలియ జేసింది సాయి పల్లవి.

అయితే ఇది మతపరమైన కాంట్రవర్సీ కి దారి తీసిందని చెప్పవచ్చు. ఇక అంతే కాకుండా ఆమె చేసిన వ్యాఖ్యలను కొంతమంది తప్పుపట్టడమే  కాకుండా మరికొంత మంది కేసులు పెట్టే వరకు వెళ్లడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ విషయంపై తాజాగా క్లారిటీ ఇచ్చింది సాయి పల్లవి. తన ఇంస్టాగ్రామ్ లో మాట్లాడుతూ తను మాట్లాడిన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని.. తన ఎవరినీ కించపరిచే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేయలేదని క్లారిటీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్ గా మారుతోంది..

ఇంటర్వ్యూలో తనకు ఫేస్ అయినా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానని.. కేవలం ఒక వర్గానికి చెందిన వారికి కంటె మనం మనుషులం అనే విషయాన్ని ఎక్కువగా నమ్ముతానని తెలియజేసింది సాయి పల్లవి. కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూసిన తర్వాత తను చాలా మానసికంగా ఇబ్బంది గురయ్యానని తెలిపింది. సమాజంలో ఎటువంటి మతం లోనైనా హింస అనేది మంచిది కాదని తెలియజేసింది. ఒక డాక్టర్గా తనకు ప్రాణం విలువ తెలుసు అని అందుచేతనే ఒక ప్రాణం తీసే హక్కు ఎవరికీ లేదని తెలియజేసింది. అయితే ఈ ఫుల్ వీడియో చూడకుండా ఇంటర్వ్యూ లో వచ్చిన ఒక చిన్న క్లిప్  తీసుకొని ఇలా మాట్లాడటం మంచిది కాదని వీడియో ద్వారా తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: