దర్శకుడిగా హరీష్ శంకర్ కి ఉన్న టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే. మాస్ మసాలా సినిమాలను చేసి అందరినీ అలరించే హరీష్ శంకర్ సినిమాలను చేయడంలో ఆలస్యం చేస్తూ ఉంటాడు కానీ చేసిన సినిమాలతో ప్రేక్షకులను అలరించడంలో ఏ విధంగానూ ఆలస్యం చేయడు. అలా పోయిన సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు హరీష్ శంకర్. వరుణ్ తేజ్ హీరోగా నటించిన గద్దల కొండ గణేష్ సినిమాను చేసిన హరీష్ శంకర్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో మరొక సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడు.

వీరి కాంబినేషన్లో గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.  అలాంటి ఓ మాస్ మసాలా సినిమా ను చేయడానికి సిద్ధమవుతున్నాడు. అయితే ఈ సినిమా ఎప్పుడో అనౌన్స్ అయినా కూడా ఇప్పటివరకు షూటింగ్ మొదలు కాకపోవడం అభిమానులను ఇంకా ఆశ్చర్యపరుస్తుంది. హరీష్ శంకర్ లాంటి డైరెక్టర్ ఈ విధంగా ఇన్ని రోజులు ఖాళీగా ఉండడం నిజంగా ఏ అభిమానికైనా నిరాశనే కలిగిస్తుంది. అలా ఈ సినిమా కోసం చాలామంది అభిమానులు వేయి కన్నులతో చూస్తున్నారు.

ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఆలస్యం చేయడం వల్లనే ఈ విధమైన సమస్యలు ఏర్పడుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే ఒప్పుకున్నా సినిమాలను చేయాల్సింది పోయి కొత్త సినిమాలతో ముందుకు వెళ్లడం అయన అభిమానులను కూడా ఏమాత్రం మెప్పించడం లేదు. అలా హరీష్ శంకర్ ఇప్పుడు వేరే హీరోలవైపు చూస్తున్నాడు. కాస్త ఆలస్యంగానే కళ్ళుతెరుచుకున్న హరీష్ త్వరలోనే రామ్ తో సినిమా చేయబోతున్నాడు అంటున్నారు. మరి పవన్ సినిమా ను పూర్తి చేసిన తర్వాత అయన రామ్ సినిమా మొదలుపెడతాడా లేదా అంతకంటే ముందే సినిమా చేసి తర్వాత పవన్ తో సినిమా చేస్తాడా అనేది చూడాలి. హరీష్ శంకర్ కు మాస్ మంచి అభిమాన గనం ఉంది. గబ్బర్ సింగ్ సినిమా తో పవన్ తో పాటు తనకు కూడా మంచి గుర్తింపు వచ్చింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: