అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ లేటెస్ట్ గా నటించిన చిత్రం "గుడ్ లక్ జెర్రీ". అయితే ఈ సినిమా నయనతార నటించిన తమిళ బ్లాక్ బస్టర్ మూవీ 'కోలమావు కోకిల' (తెలుగులో 'కో కో కోకిల') చిత్రానికి రీమేక్. తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తమిళ్ లో మంచి సక్సెస్ అందుకోగా ఇపుడు ఈ సినిమాని జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటింపచేసి రీమేక్ చేశారు. హిందీలో ఈ మూవీని సిద్దార్థ్ సేన్ డైరెక్ట్ చేశారు. మాదక ద్రవ్యాల నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా 'గుడ్ లక్ జెర్రీ' హిందీలోనూ అదే స్థాయి గుర్తింపు తెచ్చుకుంటుంది అని ఆశిస్తున్నారు.

ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇపుడు జిల్ జిల్ అంటూ రిలీజ్ కు  రెడీ అవుతోంది. ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం గురువారం ట్రైలర్ ను ఆవిష్కరించగా ఇందుకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంచనాలు మరింత పెరిగాయి. 'గుడ్ లక్ జెర్రీ' సినిమాని ఆనంద్ ఎల్ రాయ్ - లైకా ప్రొడక్షన్ సుభాకారన్ మరియు మహావీర్ జైన్ కలిసి సంయుక్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో జూలై 29న డైరెక్ట్ ఓటీటీ విధానంలో రిలీజ్ కాబోతుండటం విశేషం. రీమేక్ చిత్రాల్లో నటించడం జాన్వీ కపూర్ కి కొత్తేమీ కాదు ఇప్పటికే పలు సినిమాలు చేయగా... ఇపుడు మరో రీమిక్స్ ను తన ఖాతాలో వేసుకుంది.

అయితే ఈ సినిమా మన అతిలోక సుందరి శ్రీదేవి తనయురాలికి ఎలాంటి ఫలితం ఇస్తుంది అన్నది చూడాలి. ఇక ఈ సినిమా కథ ఇప్పటికే తమిళ్ బాషలో మంచి సక్సెస్ సాధించగా హిందీ లోనూ అదే రెస్పాన్స్ వస్తుందని అంటున్నారు. ఇక జాన్వీ కపూర్ నయనతార పోషించిన ఆ పాత్రను ఎలా పోషిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: