ప్రస్తుతం టాలీవుడ్ నుంచి మోస్ట్ వాంటెడ్ హీరోగా కొనసాగుతుంది ఎవరు అంటే అందరూ చెప్పే పేరు ప్రభాస్. ఎందుకంటే బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. అయితే ప్రభాస్ తర్వాత కూడా పలువురు హీరోలు పాన్ ఇండియా సినిమాలు తీసి హిట్ కొట్టినప్పటికీ ప్రభాస్ కి వచ్చినంత క్రేజ్ మాత్రం సంపాదించుకోలేక పోయారు. అయితే ప్రస్తుతం హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేకుండా ప్రస్తుతం ప్రభాస్ వందల కోట్ల బడ్జెట్ తో కూడిన సినిమాలను చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ సినిమాల గురించి అటు దేశ వ్యాప్తంగా అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి.


 అయితే ప్రభాస్ ఇప్పటి వరకు ఎన్నో రకాల పాత్రల్లో నటించాడు. అయితే ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ పోలీస్ పాత్రకి సరిగ్గా సరిపోతుందని అభిమానులు అనుకుంటున్నారట. అర్జున్ రెడ్డి తో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ గా మారిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిట్ సినిమా చేస్తున్నాడు.. ఇక ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు అన్న టాక్ కూడా ఉంది. అంతేకాదు ఒక స్పై గా ఈ సినిమాలో ప్రేక్షకులను పలకరించ పోతున్నాడట.


 ఈ సినిమా పై అంచనాలు కూడా పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ గా ఉన్న కత్రినా కైఫ్ ని  తీసుకోవాలని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్లాన్ చేస్తున్నట్లు టాక్. తన అందం అభినయంతో ఒకప్పుడు మెస్మరైజ్ చేసి ఇటీవల కాలంలో అడపదడపా అవకాశాలు మాత్రమే అందుకుంటున్న కత్రినాకైఫ్ ని  ప్రభాస్ కి జోడీగా సెట్ చేయడానికి సందీప్ రెడ్డి వంగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది తెలిసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఫాంలో లేని హీరోయిన్ ప్రభాస్ సరసన ఏంటి అంటూ అనుకుంటున్నారట. ప్రభాస్ సరసన కత్రినా కైఫ్ ని తీసుకోవడం అంటే అది సాహసమే అంటున్నారు మరికొంతమంది. ఇది వరకు నిజమనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: