ఇటీవల కాలంలో సినిమాలు ప్రకటించబడిన తర్వాత క్యాన్సల్ అవ్వడం మధ్యలోనే ఆగిపోవడం వంటివి జరగడం ఎక్కువ అయిపోతుంది. ఒకప్పుడు హీరోలు ఒక దర్శకుడిని నమ్మి సినిమాను ఓకే చేశారు అంటే విడుదల వరకు ఆ చిత్రాన్ని ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా ముందుకు తీసుకు వెళ్లేవారు కానీ ఇప్పుడు ఆరంభంలోనే సినిమాపై ఏమాత్రం అనుమానం వచ్చినా కూడా ఆపేస్తున్నారు. దానివల్ల ఎవరు ఎంత నష్టపోతున్నారు అన్న విషయం కూడా ఎవరు హీరోలు ఆలోచించడం లేదు.

కారణం ఏదైనా కూడా నిర్మాత కొంత డబ్బు ఖర్చుపెట్టి మొదలుపెట్టిన సినిమాను మధ్యలో ఆపేయడం వల్ల సదరు నిర్మాతకు భారీ స్థాయిలో నష్టం వాటిల్లుతుంది అని చెప్పాలి. దానిని ఏ రకంగానూ హీరోలు పూడ్చలేరు. వాస్తవానికి దర్శకులలో కూడా చాలా లోపాలు ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. కథ విషయంలో చాలామంది దర్శకులు ఎంతో పగడ్బందీగా ఉన్నప్పటికీ సినిమాను ఫుల్ గా తయారు చేసే క్రమంలో ఎందుకో ఫెయిల్ అవుతున్నారు అందువల్లనే హీరోలు సదరు దర్శకుడి సినిమాను పక్కన పెట్టేస్తున్నారు.

ఇప్పుడు టాలీవుడ్ లో రూపొందుతున్న చాలా చాలా క్రేజీ సినిమాలు మధ్యలోనే ఆగిపోవడం చిత్రీకరణలకు ఆలస్యం అవడం వంటివి జరగడానికి కారణం ఇదే కథగా చెప్పినప్పుడు దర్శకుడు ఎంతో అద్భుతంగా దాన్ని హీరోకి వివరిస్తున్నాడు కానీ ఫుల్ స్క్రిప్టులో మాత్రం అంతటి ఆసక్తిని కనబరచలేకపోతున్నాడు దాంతో హీరోలు ఎక్కడ ఆ సినిమా తమకు చెడ్డ పేరును తీసుకువస్తాయో అన్న భయంతో దానిని రిజెక్ట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ కొరటాల శివ త్రివిక్రమ్ మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాలు ఈ కోవలేక వస్తాయని చెప్పాలి. అంతకుముందు పూరి జగన్నాథ్ మరియు విజయ్ దేవరకొండ జనగణమన సినిమా కూడా ఈ కోవలోకే వస్తుంది. మరి దర్శకులలో ఇంతటి ఆత్మవిశ్వాసం కోల్పోవడానికి కారణం ఏంటో తెలియట్లేదు కానీ వారిలో సృజనాత్మకత రోజుకు తగ్గుతుంది అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: