సినిమా అంటేనే ఒక మ్యాజిక్ అని చెప్పాలి.. ఒక్కోసారి మంచి కథలు అనుకుని తీసినవి బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా ఫెయిల్ అవుతుంటాయి. మరికొన్ని సార్లు ఒక మాదిరిగా ఉన్న కథ అయినా యిట్టె ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యి మంచి వసూళ్లను సాధించి మూవీ మేకర్స్ ను మరియు ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ఉంటుంది. అలా ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఒక సాధారణ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అసాధారణ రీతిలో ప్రేక్షకులను థ్రిల్ చేసి ఘన విజయాన్ని అందుకుంది. మళయాళంలో ఇటీవల విడుదలైన "జయ జయ జయ జయహే" సినిమా చిన్న సినిమాగా విడుదలై 25 కోట్ల కలెక్షన్ లను సాధించి అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది.

డైరెక్టర్ విపిన్ దాస్ ఈ సినిమాను తెరకెక్కించగా , బాసిల్ జోసెఫ్ మరియు దర్శన రాజేంద్రన్ లు భార్యాభర్తలుగా అద్భుతంగా నటించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా గురించి ఇప్పుడు టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది... మన టాలీవుడ్ నిర్మాతలు పక్క ఇండస్ట్రీ సినిమా హిట్ అయితే చాలు రీమేక్ చేయడానికి రెడీ గా ఉంటారు. అదే విధంగా ఈ సినిమాను కూడా తెలుగులోకి అనువదించడానికి ప్రముఖ నిర్మాణ సంస్థ సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా రీమేక్ హక్కులను కొనుగోలు చేయడానికి మలయాళ దర్శక నిర్మాతలలో మంతనాలు చేస్తున్నారట.

జయ జయ జయ జయహే లాంటి ఫ్యామిలీ మూవీలో నటించడానికి ఎవరైతే బాగుంటుందని ఆలోచిస్తే, ఇటీవలే విశ్వక్ సేన్ తమిళ మూవీ "ఓమై కడవులే" సినిమాను "ఓరి దేవుడా" పేరుతో రీమేక్ చేసి సక్సెస్ కొట్టాడు. కాబట్టి విశ్వక్ సేన్ ను ఎంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.    

మరింత సమాచారం తెలుసుకోండి: