టాలీవుడ్లో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ దొరసాని చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాగా పెద్దగా ఆకట్టుకోలేక పోయారు. ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో బాగానే పేరు సంపాదించారు. ఆ తర్వాత విడుదలైన సినిమాలతో పరవాలేదు అనిపించుకున్న ఆనంద్ దేవరకొండ సరైన సక్సెస్ రాలేదని చెప్పవచ్చు. ఇప్పుడు తాజాగా సరికొత్త విభిన్నమైన కథ అంశంతో బేబీ అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ చిత్రంలో హీరోయిన్గా వైష్ణవి చైతన్య నటిస్తోంది. ఈ సినిమాని సాయి రాజేష్ నీలం రూపొందిస్తూ ఉన్నారు. ఈ చిత్రంలో కీలకమైన పాత్రలు వీర్రాజు అశ్విన్ నటిస్తూ ఉన్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల చేయడం జరిగింది. వాటి గురించి తెలుసుకుందాం.


ఈ చిత్రం టీజర్ విషయానికి వస్తే మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడును ఉంటుంది అనే అక్షరాలతో మొదట ఈ చిత్రం టీజర్ మొదలవుతుంది ఇక హీరో హీరోయిన్ హై స్కూల్ డేస్ లో కాలంనాటి విజువల్స్ తో మొదట ఈ టీజర్ మొదలవుతుంది. ఇక హీరో హీరోయిన్ కు స్కూల్లో ప్రేమ చిగురుస్తుంది ఇద్దరు కలిసి ఏకాంత సమయాన్ని గడపడం ఈ టీజర్ లో చూపించడం జరిగింది.


ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపిస్తూ ఉన్నాయి. ఈ చిత్రం చాలా ఎమోషనల్ తో సాగే చిత్రంగా కనిపిస్తుంది. ఈ చిత్రం టీచర్ చూస్తూ ఉంటే బేబీ చిత్రం ఒక ఫీలింగ్ గుడ్ లవ్ స్టోరీ అన్నట్లుగా చాలా స్పష్టం అవుతోంది. ఈ సినిమాకి విజయ్ బుల్గానిక్ సంగీతాన్ని అందించారు. ఫైనల్ గా ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ సాలిడ్ హిట్టుని తన ఖాతాలో వేసుకునేలా ఉన్నారంటూ పలువురు నెటిజన్ల సైతం కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి టీజర్ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: