ఖడ్గమృగం గురించి చాలా మంది వినే వుంటారు.. ఇకపోతే దాని కొమ్ముల గురించి కూడా మీకు తెలిసే ఉంటుంది కదా..! ఒకవేళ తెలియక పోతే దాని కొమ్ముల గురించి తెలిస్తే మాత్రం కచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. నిజం చెప్పాలంటే ఖడ్గమృగం కొమ్ము చాలా ఖరీదైనదట..ఇక బంగారం అయినా చౌకగా వస్తుందని చెబుతున్నారు.. ఈ కొమ్ము లో ఉండే ప్రత్యేకత ఏమిటి..? ఎందుకు అంత ఖరీదు చేస్తుంది..? అనే విషయం గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలి. నిజానికి లక్షల రూపాయలు విలువ చేస్తుందట. ఒక్కసారి వేటగాళ్ల ఉచ్చులో పడితే మాత్రం బలిఅవ్వక తప్పదు. ఫలితంగా వేటగాళ్లు లక్షాధికారులు కూడా అవుతున్నారు. అయితే ప్రభుత్వ అధికారులు ఖడ్గమృగాల కంట పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఖడ్గమృగం కొమ్ములలో కెరటిన్ అనే పదార్థం ఉంటుంది. దీని ధర కూడా చాలా ఎక్కువ .బంగారం కంటే విలువైనది కూడా.. ఈ కెరటిన్ కారణంగా ఖడ్గమృగాల కొమ్ములు అత్యంత ధరకు అమ్ముడు పోతున్నాయి. ఇక లక్షల రూపాయల విలువ చేస్తాయి.. కాబట్టి వాళ్ళు కూడా ఖడ్గమృగాల వేటాడుతూ ఉంటారు. చైనాలో కొమ్ములను మ్యాజికల్ మెడిసిన్ అని కూడా అంటారు. ఖడ్గమృగాలు కొమ్ములలో ఉండే  కెరటిన్ జుట్టుకు సంబంధించిన చికిత్సలలో వాడుతుంటారు. అత్యంత విలువైనది కాబట్టి చాలామంది వీటి కొమ్ములను వ్యాపారంగా చేసుకొని గుట్టుచప్పుడు కాకుండా కొమ్ములను నరికివేస్తున్నారు.

వీటి కొమ్ములను పొడిగా తయారుచేసి వివిధ రకాల ఔషధాలలో ఉపయోగిస్తూ ఉండడం గమనార్హం. ఇక ఈ కొమ్ముల లో ఉండే కెరటిన్ కేవలం జుట్టుకు మాత్రమే కాకుండా క్యాన్సర్ వ్యాధి నుంచి హ్యాంగోవర్ వరకు వివిధ రకాల మందుల తయారీలో కూడా ఉపయోగిస్తూ ఉండడం గమనార్హం.. కేవలం చైనాలో మాత్రమే కాకుండా వివిధ దేశాల్లో కూడా ఈ కొమ్ములకు మంచి డిమాండ్ వుంది. ఒకసారి ఖడ్గమృగం కొమ్ము కోసినా తిరిగి మళ్ళీ పెరుగుతుంది కాబట్టి చాలామంది వీటిని కోయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఆసియాలో అయితే ఖడ్గమృగాల కొమ్ముల కంటే బంగారం చాలా చీప్ గా దొరుకుతుందట.అందుకే వీటికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అని చెప్పవచ్చు. ప్రస్తుతం దేశంలో రెండు వేలు మాత్రమే ఉన్నాయని అది కూడా అస్సాంలో ఎక్కువగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: