కలెక్షన్ కింగ్ డైలాగ్ కింగ్ మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ తెలుగు లో చాలా సినిమాలు చేసినప్పటికీ సరైన స్టార్ డమ్  మాత్రం సంపాదించుకోలేక పోయాడు. అయితే మంచు మనోజ్ సినిమాలు అంటే రియలిస్టిక్ ఫైట్ లు.. . మంచు మనోజ్ ఎక్కువగా డూప్ లేకుండా తానే ధైర్యం చేసి మరీ స్టెంట్స్  చేస్తుంటాడు. అందుకే అతని రియల్ హీరో అని కూడా పిలుస్తుంటారు. అయితే మంచు మనోజ్ ఎన్నో విభిన్నమైన కథల్లో నటించినప్పటికీ ఆయనకు సరైన గుర్తింపు  మాత్రం తీసుకు రాలేదు ఏ సినిమా. ఇదిలా ఉంటే మంచు మనోజ్ కొన్నిరోజులుగా సినిమాల్లో కనిపించడం లేదు. అయితే ఆయన సినిమాల్లో కనిపించక పోవడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి అంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి . అయితే ప్రస్తుతం దీనిపై క్లారిటీ ఇచ్చారు మంచు మనోజ్. 


 అయితే మంచు మనోజ్ విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తమ విడాకుల ప్రక్రియ పూర్తయిందంటూ బరువైన హృదయం తో  అభిమానులందరికీ లేఖ రాసాడు  మంచు మనోజ్. తన విడాకుల ప్రక్రియ పూర్తయిందని బరువైన హృదయంతో అభిమానులకు తెలియజేస్తున్నాను అంటూ  లేఖలో పేర్కొన్నాడు. రెండేళ్ల తమ అందమైన బంధానికి ముగింపు పలకాల్సిన వచ్చిందని... మా  మధ్య కొన్ని భేదాభిప్రాయాలు కారణంగా విడిపోవలసి వచ్చిందని తెలిపారు.తమ మధ్య  ఏర్పడిన భేదాభిప్రాయం తో  చాలా నొప్పిని  కూడా అనుభవించానని లేఖలో తెలిపారు మంచి మనోజ్ . 


 ఎంతో వేదన తర్వాత ఇద్దరం విడిపోవడానికి నిశ్చయించుకున్నమని   చెప్పారు మంచు మనోజ్. అయితే విడాకులు తీసుకుని విడిపోయినా కూడా ఇద్దరం ఒకరిని ఒకరు ఎప్పుడూ గౌరవించుకుంటూనే ఉంటామని... తాము తీసుకున్న నిర్ణయాన్ని అందరూ గౌరవిస్తారు అని అనుకుంటున్నాము మంచు  మనోజ్  తెలిపాడు. అంతేకాకుండా తమ వ్యక్తిగత జీవితానికి ప్రైవసీ ఇస్తారని ఆశిస్తున్నాను అంటూ లేఖలో పేర్కొన్నాడు మంచు మనోజ్. కొన్ని రోజుల నుంచి తన మనసు మనసులో లేదని అందుకే నటనపై కూడా దృష్టి పెట్టలేకపోయాను అని తెలిపాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కుటుంబం స్నేహితులు ముఖ్యంగా అభిమానులు తోడుగా నిలిచారని మంచు మనోజ్  తెలిపారు. తను కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపిన మనోజ్ ... ఇక సినిమాలపై దృష్టి పెట్టి మళ్ళీ తిరిగి వస్తానని అభిమానులకు తెలియజేశాడు. కాగా ప్రస్తుతం మంచు మనోజ్ ఎమోషనల్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: