బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్" దబాంగ్ ౩ " తో మన ముందుకు రాబోతున్నాడు. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ ౨౦ వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దబాంగ్ సినిమా హిట్ అవడంతో, ఆ సినిమాకి సీక్వెల్స్ తీసుకుంటూ వస్తున్నారు. అయితే ఇదిలా ఉంటే, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈ వెంట్ పై అందరికీ ఆసక్తి ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఆ ఈవెంట్ హైదరాబాదులో జరుగుతుంది కాబట్టి.

 

హిందీ సినిమాలకి హైదరాబాద్ లో ఆదరణ ఎక్కువగానే ఉంటుంది. దక్షిణాదిలో ఒక్క హైదరాబాద్ లోనే హిందీ సినిమాలకి కలెక్షన్లు ఎక్కువగా వస్తుంటాయి. హైదరాబాద్ లో వివిధ రాష్ట్రాల వారు నివసించడమే కాక, హైదరాబాద్ లోని వారికి కూడా హిందీపై పట్టు ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇక్కడ హిందీ సినిమాలకి కలెక్షన్లు బాగా వస్తుంటాయి. ఆ కలెక్షన్లని మరింత పెంచే క్రమంలోనే సల్మాన్ ఖాన్ తన సినిమా ఈవెంట్ ఇక్కడ చేయనున్నాడట.

 

తెలుగులో ప్రతి స్టార్ హీరో సినిమా ఈవెంట్‌నూ నిర్వహించే శ్రేయాస్ మీడియా సంస్థ ‘దబంగ్-3’ ప్రి రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనుంది. ఇక్కడ పెద్ద ఈవెంట్లకు వేదికగా నిలిచే జేఆర్సీ కన్వెన్షన్ సెంటరే ఈ వేడుకకు కూడా వేదిక కానుంది. ఈ నెల 18న ఈ ఈవెంట్ చేయబోతున్నారు. దీనికి సల్మాన్ ఖాన్ వస్తాడా రాడా అన్నదానిపై స్పష్టత లేదు. ఐతే దర్శకుడు ప్రభుదేవా, హీరోయిన్ సోనాక్షి సిన్హా, విలన్ పాత్రధారి సుదీప్ మాత్రం ఈ ఈవెంట్లో సందడి చేయబోతున్నారని సమాచారం.

 

దబాంగ్సినిమా హిందీ తో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదల అవుతుంది. అయితే ఈ రెండు భాషల ప్రమోషన్లపై అంతగా ఫోకస్ పెట్టినట్టు కనబడట్లేదు. సినిమాని పాన్ ఇండియా బేస్ గా రిలీజ్ చేయాలనుకున్నప్పుడు ప్రాంతీయ భాషల మీద ఫోకస్ పెడితే మరింత బాగుంటుంది.
  

మరింత సమాచారం తెలుసుకోండి: