నిన్న మొన్నటి వరకు పదహారణాల అచ్చ తెలుగమ్మాయిలా కనిపించిన పునర్నవి సడెన్‌గా ప్లేట్ ఫిరాయించింది. తనలోని యవ్వనాన్ని, పరుగెత్తే పరువాన్ని బయట పెడుతున్న ఒక ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ విధంగా కనిపించే పునర్నవి ని చూసే కుర్రకారు గుండెల్లో ఏకంగా గునపాలే దిగినా ఆ బాధ తెలియనంతలా పునర్నవి చూపులతో, తన సోయగాలతో మత్తెక్కిస్తుందట.

 

 

ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టంట్ గా పాల్గొన్న పునర్నవి భూపాలం.. తన గ్లామర్ షో తో హౌస్ కే అందాన్ని తీసుకొచ్చింది. అంతే కాకుండా ఈ షో తరువాత విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. అంతే కాదండోయ్ రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ విన్నర్ గా నిలిచాడంటే దానికి కారణం, సహకారం అంతా పునర్నవి అన్న విషయం తెలిసిందే.. ఇక హౌస్ లో ఉన్నప్పుడు వీరిద్దరి మధ్య నడిచిన లవ్ ట్రాక్ బాగా హైలైట్ అయింది.

 

 

అదీ గాక బిగ్ బాస్ షో ముగిసిన తర్వాత కూడా వీరి స్నేహన్ని కంటిన్యూ చేస్తూ చాలా సార్లు ఒకరికొకరు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటంతో రాహుల్, పునర్నవిల మధ్య ఏదో నడుస్తుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. ఇదిలా ఉండగా కొన్ని సినిమాల్లో నటించిన పునర్నవి కి ఆ చిత్రాలు పెద్దగా గుర్తింపు తీసుకు రాలేకపోయాయి. ఆమె సినీ లైఫ్‌కు బ్రేకును అందించలేక పోయాయి. ఇక తన చేతిలో ఉన్న ఒక్క సినిమా 'సైకిల్' దీన్ని కంప్లీట్ చేసేపనిలో ఉన్న పునర్నవి ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటో షూట్ లతో ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది..

 

 

ఈ క్రమంలోనే ఈ అందాల సుందరికి సంబంధించి మెడిటేషన్ చేస్తున్న ఉన్నఒక ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది.. ఇకపోతే ఈ పాలకోవా పడుచుది ఎప్పుడు ఇంత బోల్డ్ గా ఎప్పుడూ కనిపించలేదు. కానీ సడెన్‌గా ఇప్పుడు పిచ్చ హాట్‌గా ఇలా దర్శనం ఇవ్వడంతో ప్రతి వారు షాక్‌కు గురవ్వుతున్నారట. మరి రాహూల్ ఫీలింగ్స్ ఏంటో తెలియదు గానీ  ఈ ఫోటోని మాత్రం ఎవరో కావాలని లీక్ చేసి ఉంటారనే కామెంట్స్ ప్రస్తుతం వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: