ప్రయోగాలు చేయడంలో తమిళ డైరెక్టర్స్ ముందుంటారన్న విషయం తెలిసిందే. అయితే అందులో మనవాళ్ళు కూడా బాగా ముదిరిపోయారు.అంతకంటే అద్భుతమైన ప్రయోగాలు చేస్తూ వాళ్ళకి ధీటుగా సినిమాలని తెరకెక్కించి బ్లాక్ బస్టర్స్ ని అందుకుంటున్నారు. అయితే తమిళ దర్శకులు నేటివిటీ టచ్ తో రా కంటెంట్ ని  డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తో ప్రయోగాలు చేసి సక్సస్ అవడం మనం ఎప్పటి నుంచో చూస్తున్నాము.

 

ఇక తెలుగు హీరోల్లో దగ్గుబాటి వారసుడు రానా ప్రయోగాలకు ఏమాత్రం వెనకాడడన్న విషయం తన మొదటి సినిమా లీడర్ తోనే అర్థమైపోయింది. అంతేకాదు అప్పటి నుంచి రానా టాలీవుడ్ లో భారీ ప్రయోగాలెన్నో చేస్తు వస్తున్నాడు. హిరణ్యకశిప భారీ ప్రయోగం. వేణు ఉడుగులతో విరాటఫర్వం కూడా ప్రయోగమేనని చెప్పాలి. ఇలాంటి సినిమాలతో టాలీవుడ్ లో ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తున్న రానా బాలీవుడ్ లో హాథీ మేరా సాథీ అనే భారీ ప్రయోగాత్మక సినిమాని చేస్తున్నాడు. తమిళ దర్శకుడు సాల్మన్ ప్రభు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. 

 

సినిమా ఫస్ట్ లుక్ ఎప్పుడో విడుదలైంది. ఒక భారీ ఏనుగుతో మావటి అవతారంలో రానా ఇచ్చిన ఫోజు అభిమానుల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఆ లుక్ కి ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అడవుల్లోనే మెజారిటీ కథాంశం సాగుతుందట. బ్యాక్ గ్రౌండ్ లో పచ్చని అడవులు కాకుండా బీడువారిన ఎరుపు రంగు అడవి కనిపిస్తుందని నిర్మాత డి.సురేష్ బాబు తెలిపారు. దాదాపు 30 నిమిషాల నిడివి ఉన్న విజువల్ గ్రాఫిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయని.. అడవిని కూడా వీఎఫ్.ఎక్స్ లో క్రియేట్ చేస్తున్నామని తెలిపారు మేకర్స్. అయితే ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి ఫ్రెష్ అప్‌డేట్ ఇవ్వలేదు చిత్ర యూనిట్. 

 

అయితే ఏప్రిల్ 20న ఈ సినిమా రిలీజ్ కానుందని తాజాగా సమాచారం. అలాగే కొద్ది రోజుల క్రితం రిలీజైన రానా పోస్టర్ చూస్తుంటే ఆ పాత్రలో ఎంతో సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉన్నాయని  అర్థమవుతోంది. ఈ సినిమాలో రానా రాతియుగం నాటి రా అండ్ రగ్గ్ డ్ లుక్ లో కనిపిస్తారట. రానా గెటప్.. హావభావాలు చూస్తుంటే మొరటు మనిషిగా కనిపిస్తున్నాడు. మాసిన గుబురు గడ్డం .. చెదిరిన జుట్టు.. ముఖంపై గాట్లు ... ఒంటికి గోనె సంచులు చుట్టుకున్న విధానం చూస్తుంటే ఈ పాత్ర విపరీతమైన మాసీగా ఉంటుందని తెలుస్తోంది. ఇక గత కొంతకాలంగా సినిమాలేవి రిలీజ్ కాలేదు. ఆలోటు తీర్చడానికి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రావడానికి సిద్దమవుతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: