టాలీవుడ్ లో ఇలియానా కు ఒకప్పుడు మంచి డిమాండ్ ఉండేది అనే విషయం అందరికి తెలిసిందే. ఆమెతో సినిమా చేయడానికి అప్పట్లో దర్శక నిర్మాతలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉండే వారు. అయితే మధ్యలో ఆమె ప్రేమ వ్యవహారం కారణంగా ఆమె కెరీర్ ని తానే స్వయంగా ఇబ్బంది పెట్టుకుంది అనే వార్తలు వచ్చాయి. అక్కడి నుంచి ఆమె డిమాండ్ భారీగా తగ్గింది అనేది అందరికి స్పష్టంగా అర్ధమవుతుంది. ఇప్పుడు టాలీవుడ్ లో ఆమె మళ్ళీ బిజీ అవ్వాలని చూస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఆమె సినిమా చేసే హీరోలు కూడా ఇప్పుడు ఆమెతో చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని అంటున్నారు. 

 

అగ్ర హీరోల సరసన ఆమె సినిమాలు చెయ్యాలని చూస్తుంది. ఇక అగ్ర దర్శకులు కూడా ఆమెతో సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. బాలీవుడ్ లో ఆమె ప్రయత్నాలు చేసినా సరే అక్కడ ఫలించలేదు అని ఇప్పుడు తెలుగులో చెయ్యాలని చూస్తుంది అంటున్నారు. అయితే ఆమె పారితోషికం కూడా భారీగా తగ్గించింది అంటున్నారు. గతంలో ఆమె మూడు కోట్ల వరకు తీసుకునేది. కాని ఇప్పుడు దాన్ని భారీగా తగ్గించింది అంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని ఆమె తో సినిమా చేయడానికి త్రివిక్రమ్ ముందుకి వస్తున్నాడని అంటున్నారు. 

 

ఆయన ఆమెను ముంబై లో కలిసారని అప్పుడు ఆమె సినిమా చేయడానికి ఓకే చెప్పింది అంటున్నారు. అయితే ఎన్టీఆర్ సినిమా తర్వాత త్రివిక్రమ్ చేసే సినిమాలో ఆమె చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక టాలీవుడ్ లో ఆమె ఇక సోలో గా కూడా నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను చెయ్యాలని చూస్తుంది అంటున్నారు. సినిమా కథల విషయంలో ఆమె చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: