టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న డిమాండ్ గురించి అందరికి తెలిసిందే, జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి గానూ ఎందరో దర్శక నిర్మాతలు ఎక్కువగా పోటీ పడుతూ ఉంటారు. ఆయన తో సినిమా అవకాశం వస్తే చాలు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు మన తెలుగులో ప్రస్తుతం తారక్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా దాదాపుగా కథ రెడీ చేసుకుని షూటింగ్ కి సిద్దంగా ఉంది. 

 

సినిమా తర్వాత తారక్ మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. కొరటాల శివ తో సినిమా చేయడానికి గానూ తారక్ రెడీ అయినట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. సినిమా కథ అంతా రెడీ గా ఉందని జనతా గ్యారేజ్ తర్వాత ఆ సినిమా చెయ్యాల్సి ఉందని కాని కొన్ని కారణాలతో అది వాయిదా పడటం ఆ తర్వాత ఇద్దరూ కూడా బిజీ అవ్వడం తో ఆ సినిమాను వాయిదా వేసారని సమాచారం. ప్రస్తుతం తారక్ చేస్తున్న సినిమాల తర్వాత ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

 

ఈ సినిమాకు సంబంధించి నిర్మాణ బాధ్యతలను రామ్ చరణ్ కొంత తీసుకునే అవకాశాలు ఉన్నాయి అనేది కొందరి మాట. ఈ సినిమాలో పెట్టుబడి పెట్టడానికి గానూ రామ్ చరణ్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడని అంటున్నారు. కళ్యాణ్ రామ్ తో పాటుగా రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించే అవకాశం ఉందని అంటున్నారు. కథ లో సామాజిక కోణం తో పాటుగా రాజకీయం  కూడా ఎక్కువగా ఉంటుందని సమాచారం. కథ ఎప్పుడో రెడీ కావడం తో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి సిద్దంగా ఉందట.

మరింత సమాచారం తెలుసుకోండి: