ఎప్పటికప్పుడు టెక్నాలజీ మారుతున్న ఈ డిజిటల్ యుగంలో సరికొత్త ఎంటర్టైన్మెంట్ ట్రెండ్ ఓటిటి ప్లేట్ ఫార్మ్స్ రూపంలో దూసుకుపోతుంది. సినిమాలు, చానల్స్ అన్నిటిని వీక్షించే ట్రెండ్ ఓటిటి ప్లేట్ ఫార్మ్స్ ద్వారా ఈ కరోనా వైరస్ రూపంలో అందరికీ అందుబాటులో ఉండటంతో ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులు ఓటిటి ప్లేట్ ఫార్మ్ ద్వారా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాలు చూడాలంటే థియేటర్ క్లోజ్ అవ్వటంతో, సినిమా ప్రేమికులంతా ఈ విధంగా ఓటిటి ద్వారా లాక్ డౌన్ టైం లో ఎంజాయ్ చేస్తున్నారు. అందరికంటే ముందుగా ఓటిటి ప్లేట్ ఫార్మ్ లో అడుగుపెట్టిన SUNNXT లో ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా సినిమాలన్నీ చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారట. వాటి వివరాలు మీకోసం. 

 

‘అల వైకుంఠపురంలో’:

 

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి పండుగకు రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఒక గొప్ప ఇంటికి చెందిన అల్లు అర్జున్ చిన్న వయసులోనే ఆ ఇంటిలో పని చేసే వ్యక్తి దగ్గర పెరగటం...తరువాత తన పుట్టుక గురించి తల్లిదండ్రుల గురించి తెలుసుకుని వాళ్లని కాపాడటం ఈ సినిమా యొక్క స్టోరీ. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రాసిన పంచ్ డైలాగులు, అల్లుఅర్జున్ యాక్టింగ్ మరియు పాటలు సూపర్ డూపర్ హిట్ అవడంతో SUNNXT లో ఈ సినిమాని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

 

‘వరల్డ్ ఫేమస్ లవర్’:

 

విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది. కానీ మొట్టమొదటి రోజే మిక్సడ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో ఈ సినిమాని SUNNXT లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రైటర్ గా విజయ్ దేవరకొండ తన స్టోరీ రాస్తూ ఉన్న స్టోరీ ని అసలైన సినిమా స్టోరీ గా డైరెక్టర్ తెరకెక్కించడం జరిగింది. 

 

‘డిస్కో రాజా’:

 

రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది జనవరిలో రిలీజ్ అయింది. నభ నటాషా, ఆర్ ఎక్స్ 100 ముద్దు గుమ్మ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించింది. విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నీ కూడా ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ తరహాలో తెరకెక్కిన ఈ సినిమా లో రవితేజ డబల్ క్యారెక్టర్ లో నటించడం జరిగింది. బ్రెయిన్ డెడ్ అయిన రవితేజ బయో ల్యాబ్ లో తన బ్రెయిన్ పై పరిశోధనలు జరిగిన తర్వాత ల్యాబ్ నుండి సడన్ గా తప్పించుకుని తన వారి కోసం రవితేజ ఏం చేశాడు అన్నది సినిమా.

 

దొరసాని:

 

ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ జంటగా తెరకెక్కిన దొరసాని గత ఏడాది జూలై మాసంలో రిలీజ్ అయింది. కె.వీ.ఆర్ మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ పెద్దగా అలరించలేకపోయింది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించడంతో సినిమాపై హైప్ అప్పట్లో ఓ రేంజ్ లో ఉంది. ఇదే సమయంలో హీరోయిన్ గా రాజశేఖర్ కూతురు శివాత్మిక కూడా నటించడం సినిమాకి మరో ఎస్సెట్. సినిమా స్టోరీ కి వస్తే ఒక ఊరికి పెద్దగా ఉండే గొప్పింటి అమ్మాయిని పేదరికం కలిగిన అబ్బాయి ప్రేమించడం జరుగుతుంది. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం. దీంతో వీరిద్దరూ కలిసి ఎదుర్కొన్న కష్టాలు ఏంటి అన్నది 'దొరసాని' సినిమా.

 

భీష్మ:

 

వరస ఫ్లాపుల్లో ఉన్న నితిన్ కి 'భీష్మ' సినిమా ద్వారా ఈ ఏడాది అదిరిపోయే హిట్ పడింది. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే విజయాన్ని సాధించింది. స్టోరీ విషయానికొస్తే ఐఏఎస్‌ అని భీష్మ (నితిన్‌) చెప్పుకుంటూ అమ్మాయిల వెంట పడతాడు. పరిచయం అయిన కొద్ది నిమిషాల్లోనే 'భీష్మ' కు బైబై చెప్పి వెళ్లిపోతారు. ఎందుకంటే అతడు చెప్పిన ఐఏఎస్‌కు అర్థం కలెక్టర్‌ అని కాదు.. ఐయామ్‌ సింగిల్‌ అని. డిగ్రీ డ్రాపౌట్‌ అయిన 'భీష్మ' సోషల్‌ మీడియాలో మీమ్స్‌ క్రియేట్‌ చేసి పోస్ట్‌ చేస్తూ కాలం వెళ్లదీస్తుంటాడు. అయితే అనుకోకుండా  చైత్ర(రష్మిక)ను తొలి చూపులోనే ఇష్టపడి, వెంటపడతాడు. తొలుత భీష్మను అసహ్యించుకునే చైత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అయితే అనుకోని సంఘటనలు తర్వాత వారిద్దరి మధ్య చోటు చేసుకుంటే.. వాటిని నితిన్ ఏ విధంగా సాధించాడు అన్నది ఈ సినిమా. ఏప్రిల్ 25 వ తారీఖున ఈ సినిమా SUNNXT లో రిలీజ్ కానుంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: