ఒకప్పటి తోప్ మ్యూజీషియన్స్ కి  ధీటుగా సంగీతాన్ని ఇస్తూ..స్టార్లకు మెమరబుల్ హిట్స్ ఇస్తున్నాడు  థమన్ . తెలుగులోనేకాదు .. సౌత్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ కంటిన్యూ చేస్తున్నాడు . మెలోడీస్, మాస్ సాంగ్, మాంచి రొమాంటిక్ సాంగ్స్ ఇలా అసలు ఏ జానర్ కావల్సిన సాంగ్స్ ని వాళ్లకి ఇస్తూ ఫ్యాన్స్ ని ఫిదా చెయ్యడమేకాకుండా  సోషల్ మీడియాలో కూడా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడు .

 

థమన్ మ్యూజిక్ దెబ్బకి  సినిమాలుహిట్ అవ్వడమే కాదు ..యూట్యూబ్ లోరికార్డులు బద్దలవుతున్నాయి. ఈ సంవత్సరం థమన్ మ్యూజిక్ డైరెక్షన్లో  జనవరిలో రిలీజ్ అయ్యిన అల్లు అర్జున్ అలవైకుంఠపురంలో మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. సినిమా రిలీజ్ అయ్యి 4 నెలలుకావస్తున్నా..ఇంకా పాటలరికార్డులు మాత్రం ఆగడం లేదు . అలవైకుంఠపురంలో ప్రతి పాట సూపర్ హిట్టే. సామజవరగమనా తో పాటు రాములోరాములా,   ఈ రెండు పాటలు కోట్ల వ్యూస్ తో యూట్యూబ్ లోసెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇక బుట్టబొమ్మ సాంగ్ అయితే టాలీవుడ్, బాలీవుడ్ దాటి హాలీవుడ్ వెళ్లిపోయింది. సెలబ్రిటీల దగ్గరనుంచి క్రికెటర్ల వరకూ అందరూ ఈ పాటకు చిందులేస్తున్నారు. అంతగా హిట్ అయిన ఈ పాట యూట్యూబ్ లో 15 కోట్ల వ్యూస్ క్రాస్ అయ్యి తెలుగులోనేకాదు ..సౌత్ ఇండియాలోనే ఇన్ని హిట్స్ కొట్టిన పాటగా రికార్డ్ క్రియేట్ చేసింది. 

 

ఈ ఒక్క పాటే కాదు ..థమన్ మ్యూజిక్ డైరెక్షన్లో రీసెంట్ గా వచ్చిన వకీల్ సాబ్  పాట కూడా రికార్డ్ క్రయేట్ చేసింది. పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ అయిన వకీల్ సాబ్  లో రెండు నెలల క్రితం రిలీజ్ అయిన మగువా..మగువా పాట కూడా మెలొడియస్ గా చాల మందిని ఆకట్టుకుంది. ఎంతో మీనింగ్ ఫుల్ గా సాగే లిరక్స్ కి అంతే సూథింగ్ గా ఉండే థమన్ మ్యూజిక్ యాడెడ్ ఎట్రాక్షన్ అయ్యి ఆడియనస్ కి తెగ నచ్చేసింది.  ప్రతి రోజు పండగే లో ఓ బావా సాంగ్ కూడా అదిరిపోయే హిట్స్ అందుకుంది. లాస్ట్ ఇయర్ అఖిల్ హీరోగా వచ్చిన మిస్టర్ మజ్ను సినిమాలో కోపంగా కోపంగా అనే  మీనింగ్ ఫుల్ సాంగ్  మ్యూజిక్ లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. 

 

అరవింద సమేత లో  థమన్ ఇచ్చిన మ్యూజిక్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు మిగతా జనాలుకూడా మర్చిపోలేరు. అంతగా సినిమాని డ్రైవ్ చెయ్యడమేకాకుండా ప్రతి పాటని తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. ఈ సినిమాలో క్యాచీ సాంగ్స్ చాలా ఉన్నా.. పెనివిటి పాటకు మాత్రం ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు ఆడియన్స్ . అందుకే అరవిందసమేతలో పెనివిటి పాట 4 కోట్ల 50 లక్షలకు దగ్గరవుతోంది. ఏదో లవ్ స్టోరీలు, ఫ్యామిలీ ఎంటర్ టైనర్లే కాదు .. థమన్ హార్రర్ సినిమాలకు కూడా సూపర్ మ్యూజిక్ ఇవ్వగలడని  భాగమతి సినిమాతో ప్రూవ్ చేశాడు . అనుష్క, ఉన్ని ముకుందన్ లీడ్ రోల్స్ లో వచ్చిన భాగమతి సినిమాలో  మందార మందార అనే మెలొడీసాంగ్ ..  యూట్యూబ్ లో 3కోట్లకు పైగా వ్యూస్ సంపాదించి సూపర్ హిట్ అయ్యింది.  ఇలా రికార్డ్స్ లో కూడా థమన్ తక్కువోడు కాదు అనిపించుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: