అక్కినేని ఫ్యామిలీ నటవారసులలో మూడోతరం హీరో సుశాంత్. అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా కింగ్ నాగార్జున మేనల్లుడిగా.. 'కాళిదాస్' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కానీ ఆ సినిమా విజయం అందుకోలేక పోయింది. ఆ తర్వాత వచ్చిన 'కరెంట్' సినిమాతో ఫస్ట్ హిట్ అందుకున్నాడు. మంచి లవ్ స్టొరీగా తెరకెక్కిన ఈ సినిమా.. ఆడియో పరంగాను హిట్ అయింది. ఇక ఆ తర్వాత నాలుగేళ్లు గ్యాప్ తీసుకుంటూ నటించిన 'అడ్డా' 'ఆటాడుకుందాంరా' సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేక పోయాయి. వరుస ప్లాప్ లలో ఉన్న సుశాంత్.. సినిమాలకి బ్రేక్ తీసుకొని కథను నమ్మి నటించిన సినిమా ''చి.ల.సౌ''. 2018లో హీరో రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్ గా మారి తెరకెక్కించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో సుశాంత్ నటనకు ప్రశంసల వర్షం కురిసిందని చెప్పాలి. 'చి.ల.సౌ' సినిమా నేషనల్ అవార్డు కూడా అందుకుంది. ఆ సినిమా విజయం అందించిన జోష్ లో వరుస సినిమాలని లైన్లో పెడతారని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ డైరెక్టర్ త్రివిక్రమ్ ''అల వైకుంఠపురంలో'' సినిమాలో ఎలాంటి ప్రాధాన్యత లేని పాత్రలో నటించి అక్కినేని అభిమానులను నిరాశ పరిచాడు. 

 

ఇదిలా ఉండగా ప్రస్తుతం కరోనా నేపధ్యంలో లాక్‌ డౌన్ కారణంగా ప్రతి ఒక్కరు ఇళ్ళకే పరిమితమయ్యారు. సెలబ్రెటీలు సైతం ఇంట్లోనే ఏదో ఒక పని చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. అయితే హీరో సుశాంత్ కూడా లాక్‌ డౌన్‌ని చక్కగా వినియోగించుకుంటున్నాడు. ఆన్‌ లైన్ క్లాసుల ద్వారా కీ బోర్డ్ వాయించడం నేర్చుకుంటున్నాడు. ''కీ బోర్డ్ వాయించడం నేర్చుకుంటున్నానని నాకు ఆల్ ద్ బెస్ట్ చెప్పండి'' అంటూ తానే స్వయంగా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తెలిపారు. కాగా ప్రస్తుతం సుశాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం "ఇచ్చట వాహనములు నిలుపరాదు". 'నో పార్కింగ్' అనే టాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో దర్శన్ అనే యువ దర్శకుడు పరిచయమవుతున్నాడు. ఈ చిత్రానికి రవి శంకర్ శాస్త్రి, హరీష్ లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన రైడ్ విత్ సుశాంత్ అనే ప్రత్యేక వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ చిత్రం ద్వారా అయినా మంచి విజయాన్ని సాధించి స్టార్ హీరోగా గుర్తింపు పొందాలని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: