తెలుగు చిత్ర పరిశ్రమలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలను తెరకెక్కించే దర్శకులు చాలామంది ఉన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలను తెరకెక్కించి మంచి విజయాలు అందుకుని స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్న వారిలో మొదటి వరుసలో ఉంటారు సుకుమార్. సుకుమార్ డైరెక్షన్లో ఓ సినిమా వచ్చింది అంటే అది తెలుగు ప్రేక్షకులను ఎప్పుడూ సర్ప్రైస్ చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే సుకుమార్ సినిమాలో ఎన్నో కాలిక్యులేషన్స్ ఉంటాయి. కాలిక్యులేషన్ తో పాటు  ఫ్యామిలీ ఆడియన్స్ ని తెగ ఆకర్షిస్తూ ఉంటాయి. 

 

 ఇక తనదైన కాలిక్యులేషన్స్ తో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా నాన్నకు ప్రేమతో. ఈ సినిమా ఎంతో మంది యూత్ ని  కదిలించింది అనే చెప్పాలి. మనల్ని పెంచి పెద్ద చేసిన తండ్రి ని ఎలా చూసుకోవాలి అనే ఒక మెసేజ్ ఇస్తూ ఎంతో మంది ప్రేక్షకులను ప్రభావితం చేసింది ఈ సినిమా. సాధారణంగానే ఎన్టీఆర్ ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి నటిస్తాడు . అలాగే ఈ సినిమాలో తండ్రి  పగను  పంచుకున్న కొడుకు గా నటించాడు ఎన్టీఆర్. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం సినిమా చూస్తున్న ప్రేక్షకులకు సరికొత్తగా అనిపిస్తూ ఉంటుంది. 

 


 ఒక తండ్రి కోసం ఒక కొడుకు ఎంత చేయగలడు... చివరి క్షణాల్లో తండ్రిని  ఆనందం గా ఉంచడానికి ఒక కొడుకు పడే తపన... ఈ సినిమాలు కనిపిస్తుంది. ఇక అలాంటి పాత్రలో  ఎన్టీఆర్ నటన మరింతగా ప్రేక్షకులని ప్రభావితం చేసింది. ఇక ఈ సినిమా కుటుంబంలోని ఎమోషన్స్ ని మరోసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసి సంచలన విజయాన్ని అందుకుంది. సుకుమార్  సినిమాలో మరోసారి తన కాలిక్యులేషన్స్ తో... ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ మెస్మరైజ్ చేశాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: