ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అందుకున్న కె.జి.ఎఫ్ సినిమా చాప్టర్ 2 ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఈ సినిమాను మొదటి పార్ట్ కన్నా భారీ క్రేజ్ తో తెరకెక్కిస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఈ సీక్వల్ సినిమా కోసం భారీ ప్లాన్ వేశాడని తెలిసిందే. సినిమాలో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు.

ఇక ఈ సినిమా క్లైమాక్స్ ఎపిసోడ్ భారీ రేంజ్ లో ఉంటుందట. ఈ క్లైమాక్స్ ఫైట్ కోసమే కొన్ని కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆడియెన్స్ ఊహించిన దాని కన్నా అంతకుమించి ఉండేలా ఈ క్లైమాక్స్ ఫైట్ ఉండబోతుందని తెలుస్తుంది. తప్పకుండా క్లైమాక్స్ ఆడియెన్స్ ను అలరిస్తుందని అంటున్నారు. సినిమా మొత్తం ఒక ఎత్తైతే క్లైమాక్స్ ఫైట్ ఒక ఎత్తు అనేలా ఉంటుందని తెలుస్తుంది.

క్లైమాక్స్ తప్పకుండా అలరించేలా ఉంటుందని తెలుస్తుంది. కె.జి.ఎఫ్ చాప్టర్ 2 అదరగొట్టడం ఖాయమని టాక్. ఇందుకోసం యాక్షన్ కొరియోగ్రాఫర్స్ అంతా భారీగా తమ టాలెంట్ చూపిస్తున్నారట. కె.జి.ఎఫ్ చాప్టర్ 2 తప్పకుండా అందరి అంచనాలను మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. 2021 సమ్మర్ రిలీజ్ కు ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు. అయితే సంక్రాంతి రేసులో కె.జి.ఎఫ్ 2 ఉంటుందని అంటున్నారు. మరి రిలీజ్ డేట్ ఎప్పుడన్నది చిత్రయూనిట్ నిర్ణయించాల్సి ఉంది. పార్ట్ 1 ను మించేలా మరింత క్రేజీగా ఈ చాప్టర్ 2 వస్తుంది. తప్పకుండా అందరి అంచనాలను మించేలా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.                                                               

మరింత సమాచారం తెలుసుకోండి: