విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ హీరో అన్న సంగతి తెలిసిందే. ఆయన డిఫరెంట్ జోనర్స్ లో మూవీస్ చేసినా ఎక్కువ సక్సెస్ రేట్ మాత్రం ఫ్యామిలీ జోనర్ లోనే ఉంది. ఇదిల ఉంటే వెంకటేష్ బ్యాక్ టూ బ్యాక్ ఫ్యామిలీ జోనర్ మూవీస్ చేసి హిట్లు కొట్టాక ఇపుడు కంప్లీట్ గా వేరే జోనర్ లోకి వెళ్ళి చేస్తున్న సినిమా నారప్ప. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మరో తమిళ సంస్థతో కలసి చేస్తున్న ఈ మూవీలో వెంకీ ఫెరోషియస్ గా కనిపించే పాత్ర పోషిస్తున్నారు.

మూవీ తమిళ్ అసురకు రీమేక్. వెంకీ కంప్లీట్ గా డీ గ్లామరైజెడ్ రోల్ లో రగ్డ్ ఫేస్ తో కనిపిస్తున్నారు. ఈ మూవీలో వెంకీ సరసన ప్రియమణి నటిస్తోంది. ఈ మూవీ ఇప్పటికి 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుందిట. ఇక వెంకీ కూడా షూటింగ్ లో జాయిన్ అవుతున్నాడు అంటున్నారు. దాంతో ఈ మూవీని డిసెంబర్ ఎండింగ్ కి నాన్ స్టాప్ షెడ్యూల్ తో ఫినిష్ చేస్తారు అంటున్నారు.

ఇక ఈ మూవీ తరువాత వెంకీ చేయబోయే మూవీ ఏంటి అన్నది కూడా ఇపుడు చర్చగా ఉంది. నిజానికి వెంకీ ప్రామిస్ చేసిన దాని ప్రకారం యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఎఫ్ త్రీ మూవీ చేయాలి. ఇది గత ఏడాది సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఎఫ్ 2 కి సీక్వెల్. ఈ మూవీకి వెంకీ కమిట్ అయ్యాడని, దిల్ రాజు నిర్మిస్తున్నారని అంటున్నారు.

అయితే అనిల్ రావి పూడితో పాటే మరో యంగ్ డైరెక్టర్ కి కూడా వెంకీ ప్రామిస్ చేశాడుట. ఆయనే పెళ్ళి చూపులు మూవీ ఫేం తరుణ్ భాస్కర్. ఆయన కూడా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో వెంకీ కోసం సినిమా తీయాలని తెగ ఆరాటపడుతున్నాడు. మంచి స్క్రిప్ట్ తో వెంకీని ఇప్పటికే ఆయన కలిశాడుట. దానికి వెంకీ ఓకే చెప్పేశాడు అంటున్నారు. మరి అనిల్ రావిపూడి సినిమా తీస్తే రానున్న నాలుగైదు నెల్లలో ఫుల్ స్పీడ్ తో కంప్లీట్ చేయాలి,  లేకపోతే లైన్ లోకి తరుణ్ భాస్కర్ వచ్చేస్తాడు. ఇలా వెంకీ కోసం ఇద్దరు డైరెక్టర్లు పోటీ కి రావడం అంటే సీనియర్ హీరోగా కూడా ఆయన డిమాండ్ ఒక రేంజిలో ఉందని అర్ధం చేసుకోవాలిగా.


మరింత సమాచారం తెలుసుకోండి: