టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దశాబ్ద కాలం గడిచిపోయినప్పటికి  ఎక్కడ కాజల్ అగర్వాల్ క్రేజ్ మాత్రం తగ్గలేదు అన్న విషయం తెలిసిందే. ఓవైపు సీనియర్ హీరోల సరసన మరోవైపు జూనియర్ హీరోల సరసన నటిస్తూ ఎంతో మంది అభిమానులను అలరిస్తు వచ్చింది కాజల్ అగర్వాల్. అయితే కెరీర్ విజయవంతం గా దూసుకుపోతున్న సమయంలో ఇటీవలే అక్టోబర్ 30వ తేదీన తన ప్రియసఖుడు గౌతమ్ ను  పెళ్లి చేసుకుంది అనే విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు కొంత మంది బంధువుల సమక్షంలో కాజల్ అగర్వాల్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.



 ఇక పెళ్ళి కార్యక్రమం పూర్తి చేసుకోగానే తన ప్రియ సఖి తో కలిసి మాల్దీవులకు హనీమూన్ కి వెళ్ళింది కాజల్ అగర్వాల్. ఇక అక్కడ తన భర్త గౌతమితో కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. అంతేకాకుండా తన భర్తతో కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రస్తుతం అభిమానులను అలరిస్తోంది కాజల్ అగర్వాల్. మధుర క్షణాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంది  కాజల్ అగర్వాల్. అదే సమయంలో కాజల్ అగర్వాల్ బికినీ ఫోటోలు కూడా పోస్ట్ చేస్తూ ఉంటే ఇటీవలే ఓ రొమాంటిక్ ఫోటో ని కాజల్ అగర్వాల్ పోస్ట్ చేయడంతో ఇది కాస్తా సోషల్ మీడియాను ఊపేస్తున్నది.


 సముద్రం మధ్యలో డిన్నర్ చేస్తూ బికినీలో సూపర్ రొమాంటిక్ గా కాజల్ ఉన్న ఫోటో ని తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకుంది  కాజల్ అగర్వాల్. ఈ ఫోటో నెటిజన్లను తెగ ఆకర్షిస్తూ ఉండగా.. సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు అందరూ ప్రస్తుతం మై మర్చిపోతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాగా ప్రస్తుతం తన భర్తతో కలిసి హనీమూన్లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్న కాజల్ అగర్వాల్ ఇటీవలే.. భర్తను పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏమిటి అనే దానిపై ఇపుడు ఆసక్తికర నిజం బయట పెట్టి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: