ఇప్పటి వరకు జరిగిన మూడు సీజన్లు ఎలా ఉన్న, ఇప్పుడు నాలుగో సీజన్లో మాత్రం అనేక వింతలు చోటు చేసుకుంటున్నాయి. కరోనా పుణ్యమా అని లేట్ గా మొదలయింది బిగ్ బాస్ 4 సీజన్. నిజానికి ఇది ఒక వింతే అనుకుంటే మొదట్లో బిగ్ బాస్ వాయిస్ రాకపోవడం మరొక వింత. ఇక బిగ్ బాస్ 4 సీజన్లో ఇప్పటి వరకు జరిగిన 12 వింత పరిణామాలు ఏంటో చూద్దాం.


1) 61 ఏళ్ల గంగవ్వ ఎంట్రీ: ఇప్పటి వరకు ఇంత పెద్ద వయసు కలిగిన కంటెస్టెంట్ మన ఇండియన్ బిగ్ బాస్ చరిత్రలో జరగలేదు.


2)సోహైల్, అరియానా సీక్రేట్ రూమ్: షో మొదట్లోనే ఇద్దరు కంటెస్టెంట్స్ ని సీక్రెట్ రూంలో పెట్టడం కూడా ఇదే తొలిసారి.


3) ఫస్ట్ నామినేషన్స్ రోజునే సుజాత, కరాటే కళ్యాణి వీరంగం.


4) రెండో వారంలోనే హారికను ఫేక్ ఎలిమినేషన్ చేయడం తో అభిమానులు షాక్ అయ్యారు.


5) వైల్డ్ కార్డ్ ఎంట్రీ : ముగ్గురు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వడం మరొక వింత. కమెడియన్ కుమార్ సాయి, అవినాష్, స్వాతి దీక్షిత్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు.


6) అఖిల్, మోనాల్ లవ్ స్టోరీ: ఈ లవ్ స్టోరీ ఎవ్వరూ అనుకోని విదంగా మొదలుకావడం పైగా కొన్నాళ్లపాటు అభితో పాటు ట్రైయాంగిల్ గా నడవడం


7) అఖిల్, అభిజీత్ ఫైటింగ్: ఒక్క షో కోసం అఖిల్, అభిజీత్ ల మధ్య తారాస్థాయిలో గొడవలు


8)దేవి నాగవల్లి ఎలిమినేషన్: ఎంతో స్ట్రాంగ్ అనుకున్న దేవి నాగవల్లి అంత త్వరగా వెళ్లిపోవడం నిజంగా ఒక వింతే.


9)నోయల్ సేఫ్, అమ్మ రాజశేఖర్ అవుట్: ఇలా ఒకే వారంలో అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ నోయల్ సేఫ్ కావడం ఎవ్వరు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు.


10)అఖిల్ ని సీక్రెట్ రూమ్: ఫేక్ ఎలిమినేషన్ పేరుతో అఖిల్ ని సీక్రెట్ రూమ్లో పెట్టి ‘బిగ్ బాస్’ డ్రామా రసవత్తరంగా మార్చారు.


11) సమంత హోస్ట్: దసరా స్పెషల్ ఎపిసోడ్ ను స్టార్ హీరోయిన్ గా ఉన్న సమంత హోస్ట్ చెయ్యడం ఒక వింతే అనుకుంటే అంతకు ముందు శనివారం అస్సలు హోస్ట్ లేకపోవడం మరొక వింత.


12) యాంకర్ సుమ కనకాలతో ప్రాంక్: వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తున్నట్టు బ్యాగ్ పట్టుకొని సుమ ప్రాంక్ చెయ్యడం నిజంగా వెరీ ఫన్నీ


ఈ 12 హఠాత్ పరిణామాలే కాకుండా గంగవ్వ మరియు నోయెల్ ఇద్దరు ఆరోగ్య కారణాలతో బయటకు వెళ్లడం కూడా ఒక వింతే. అంతే కాకుండా వైల్డ్ కార్డు ఎంట్రీని మొదటి వరం ఎవరు నామినేట్ చేయకూడదు అంటూ ముందు ఎపిసోడ్లలో చెప్పిన ఈ సారి మాత్రం ఒక్క వారానికే స్వాతి ని బయటకు పంపించేశారు. ఇంకా ఎన్ని ఊహించని పరిణామాలు చూడాలో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: