మాస్ మహరాజ్ రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన సినిమా క్రాక్. ఆల్రెడీ డాన్ శీను, బలుపు సినిమాలతో హిట్ అందుకున్న ఈ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా ఈ క్రాక్ వచ్చింది. ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. ఇక ఈ సినిమాలో రవితేజ శృతి హాసన్ హీరోయిన్ గా నటించి మెప్పించింది. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా మ్యూజిక్ పరంగా కూడా సూపర్ అనిపించుకుంది.

సినిమాకు ముందే హిట్టు కొడుతున్నామని కాన్ ఫిడెంట్ గా ఉన్న మాస్ రాజా.. చెప్పినట్టుగానే హిట్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా హిట్టైతే క్రాక్ 2 ఉంటుందని చెప్పాడు రవితేజ. క్రాక్ హిట్ అయితే పక్కా సీక్వల్ ఉంటుందని చెప్పాడు రవితేజ. అనీల్ రావిపుడి డైరక్షన్ లో వచ్చిన రాజా ది గ్రేట్ తో పాటుగా హిట్టైతే క్రాక్ కు కూడా సీక్వల్స్ వస్తాయని చెప్పాడు రవితేజ. అనుకున్నట్టుగానే క్రాక్ హిట్టయ్యింది. మరి సీక్వల్ వస్తుందా రాదా అని ఫ్యాన్స్ ఎక్సయిట్ అవుతున్నారు.

రవితేజ సినిమాలో ఉండాల్సిన కమర్షియల్, మాస్ అంశాలన్ని ఈ సినిమాలో ఉంచాడు. అందుకే మాస్ రాజా ఫ్యాన్స్ కు బాగా ఎక్కేసింది క్రాక్. క్రాక్ తర్వాత రమేష్ వర్మ డైరక్షన్ లో ఖిలాడి సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈ సినిమాలో మాస్ రాజా డ్యుయల్ రోల్ లో కనిపించనున్నాడు. క్రాక్ తో హిట్ ట్రాక్ ఎక్కిన రవితేజ ఈ హిత్ మేనియాని కొనసాగించాలని చూస్తున్నాడు. రవితేజ, గోపీచంద్ మలినేని ఇద్దరు కలిసి నాలుగవ సినిమా చేస్తే మాత్రం ఆ సినిమాపై అంచనాలు మరింత భారీగా ఉంటాయని చెప్పొచ్చు.                                    

మరింత సమాచారం తెలుసుకోండి: