సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన భర్తతో హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తుంది. పెళ్లై కేవలం మూడు నెలలు కూడా అవట్లేదు కాని అప్పుడే తన నెక్స్ట్ బిజినెస్ ప్లాన్స్ లో ఉంది అమ్మడు. ఇప్పటికే కాజల్ తన భర్త గౌతం స్టార్ట్ చేసిన హోం మేడ్ బిజినెస్ కిచెడ్ కు ప్రమోటర్ గా ఉంటున్న కాజల్ తన సినీ కెరియర్ ను కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెబుతుంది. ప్రస్తుతం అమ్మడు మెగాస్టార్ చ్రీంజీవితో ఆచార్య, కమల్ హాసన్ తో ఇండియన్ 2 సినిమాల్లో నటిస్తుంది.

ఈ సినిమాలతో పాటు ఫీమేల్ లీడ్ రోల్స్ కథల కోసం వెతుకుతుంది. పెళ్లి తర్వాత తన ఫ్యాన్స్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్న కాజల్ తన ఫ్యాన్స్ అడిగిన చిలిపి ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. అంతేకాదు తన భర్తతో పెళ్లి వేడుకలో ఇచ్చిన లిప్ లాక్ ఫోటోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది కాజల్. కాజల్ ఇన్ స్టాగ్రాం లో చేసిన ఈ లిప్ లాక్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

భర్తతో కాజల్ లిప్ లాక్ క్రేజీగా ఉంది. పెళ్లి వేడుకలో గౌతం, కాజల్ కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నట్టుగా భావించి ఒకరి పెదాలను ఒకరు ముద్దాడారు. తన స్నేహితుడే తన భర్త అవడం తన అదృష్టమని.. తనని బాగా అర్ధం చేసుకున్నాడు కాబట్టే గౌతం ని తను పెళ్లాడానని అన్నది కాజల్. అంతేకాదు ఆచార్యలో తన పాత్ర విశేషాలు అభిమానులతో పంచుకున్న కాజల్ సినిమాలో తన పాత్ర సర్ ప్రైజ్ చేస్తుందని.. సినిమా అద్భుతంగా ఉంటుందని చెప్పారు.                                  



మరింత సమాచారం తెలుసుకోండి: