ప్రస్తుతం క్రాక్ మూవీ రిలీజ్ అయిన సందర్భంగా ఎక్కడ చూసిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని గురించి వార్తలు వినిపిస్తున్నాయి. కరోనాలో మూతపడ్డ థియేటర్లన్నీ ఒక్కసారిగా మళ్లీ తెరుచుకోబడ్డాయి. సినీ లవర్స్ ఎంతోమంది థియేటర్లో చూడాలన్న తమ కోరికను కరోనా కారణంగా చంపేసుకున్నారు. కానీ ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ వచ్చింది. ఈ కారణం చేత ప్రజలు నిర్భయంగా బయట తిరగగలుగుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో థియేటర్లన్నీ మళ్లీ తెరుచుకోబడ్డాయి. థియేటర్లన్నీ తెరుచుకున్న తర్వాత మొట్టమొదటి సినిమా క్రాక్ అవ్వడం దర్శకుడు మలినేనిని మరింత స్టార్ పొజిషన్ లో నిలబెట్టారు ప్రేక్షకులు. ఇంతటి గొప్ప విజయాన్ని సాధించిన గోపీచంద్ మలినేని ఆరోజు మాత్రం నిద్రపోలేదట. అందుకు గల కారణాలు ఏమిటో? ఇప్పుడు చూద్దాం.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో, బి.మధు నిర్మాతగా రవితేజ, శృతిహాసన్ జంటగా  2021 జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదలైన చిత్రం క్రాక్. క్రాక్ మొదటి షో తోనే భారీ విజయాన్ని తన అకౌంట్లోకి వేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాను చూసి మల్టీ స్టార్ అయినా హీరోలంతా గోపీచంద్ కు ఫోన్ చేసి ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. "క్రాక్ సినిమా చాలా బాగుందని మెగాస్టార్ చిరంజీవి తో పాటు రామ్ చరణ్ దర్శకులు త్రివిక్రమ్,సురేందర్ రెడ్డి,హరీష్ శంకర్,అనిల్ రావిపూడి తో పాటు పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు ప్రశంసించారు. ఇక సినిమా చూసిన తర్వాత నాకు చిరంజీవి ఫోన్ చేసి,ఒంగోలులో నేను విన్న వన్నీ గుర్తొచ్చాయి అనడం నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఈ సందర్భంగా చిరంజీవిని నేను  కలిశాను".

"కరోనా లాక్డౌన్ లో దాదాపు ఎనిమిది నెలల విరామం వచ్చింది. ఓ టీ టీ లో  రిలీజ్ చేయమని చాలా ఒత్తిళ్ళు వచ్చాయి. కానీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం తీసిన సినిమా అని బలంగా నమ్మి, థియేటర్స్ లో రిలీజ్ కోసమే పట్టుదలగా ఎదురు చూశాను.సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా పెద్ద విజయం సాధించడం విశేషం.

అయితే ఈ సినిమా విడుదలకు ముందు రోజు కోర్టు నుంచి స్టే రావడంతో రాత్రంతా నిద్ర పట్టలేదు. మూడు షో లు రద్దు చేయమని కోర్టు స్టే ఇచ్చింది. ఇక మూడు షో లు  రద్దు కావడంతో చాలా బాధపడ్డాను.ఇలాంటి ఇబ్బందులు ఏ దర్శకుడికి  ఎదురు కాకూడదని మనసారా కోరుకుంటున్నాను" అని చెప్పుకొచ్చారు.  అయితే ఈ సినిమాను ఇప్పటికే హిందీలో రీమేక్ చేసేందుకు కొందరు అడుగుతున్నారట. రీమేక్ అవకాశం వస్తే తప్పకుండా చేస్తాడట గోపీచంద్ మలినేని

మరింత సమాచారం తెలుసుకోండి: