తెలుగు హీరోలలో నాగార్జున సాధించిన రికార్డు ఏమిటి? ఏ హీరోలకు సాధ్యం కానీ రికార్డును ఒక్క నాగార్జున మాత్రమే సాదించడమేమిటి. ఇంతకీ అది ఏమై ఉంటుంది ఈ ఆర్టికల్ లో చూద్దాం.

అక్కినేనికి నాగార్జున తెలుగులో బెస్ట్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు. అయితే తెలుగులో నాగార్జున అనేక చిత్రాలలోనటించారు. నాగార్జునతో పాటు మిగతా హీరోలు కూడా నటించారు. మరి నాగార్జున సాధించిన రికార్డు ఏమై ఉంటుంది? తెలుగులో చాలా మంది హీరోలు ఉన్నారు కాని ఇప్పటివరకు ఎవరు బాలీవుడ్ సినిమాలలో నటించలేదు ఒక్క నాగార్జున తప్ప. ఇప్పుడు అర్థం అయి ఉంటుంది ఆ రికార్డు ఏమిటో అవును తెలుగు పరిశ్రమ నుంచి అత్యధిక హిందీ సినిమాలలో నటించిన హీరోగా నాగార్జున రికార్డు సాధించారు.

నాగార్జున హిందీ లో చేసిన మొదటి చిత్రం 'శివ' నటించిన సినిమా అనేకంటే రీమేక్ సినిమా అని చెప్పవచ్చు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'శివ' చిత్రం తెలుగులో ఒక ట్రెండ్ సెట్టర్ ను సృష్ట్టించింది.ఈ సినిమాను అవే పాత్రలతో హిందీలోకి రీమేక్ చేసారు. బాలీవుడ్ లోను 'శివ' మంచి విజయాన్నిఅందుకుంది. తొలి చిత్రం ఇచ్చిన విజయంతో నాగార్జున అడపాదడపా పలు హిందీ సినిమాలలో నటించారు.శివ తర్వాత నాగార్జున రాము దర్శకత్వం లో 'అంతం' అనే సినిమాని ఏకకాలంలో రెండు భాషల్లో తెరకెక్కించారు.      

ఆలాగే నాగార్జున హిందీలో నటించిన మరో చిత్రం 'ఖుదా గవా' ఇందులో నాగార్జున అమితాబ్ బచ్చన్ వంటి అగ్ర నటుడి పక్కన చేయడం విశేషం. వీటితో పాటు మిస్టర్ బేచారా, అగ్నివర్ష అనే చిత్రాలలో కూడా నాగార్జున నటించారు.అయితే హిందీలో అత్యధికంగా మహేష్ బట్ దర్శకత్వం లోనే నాగార్జున ఎక్కువ సినిమాలు చేసారు. నాగార్జున-మహేష్ బట్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా 'క్రిమినల్'. ఈ సినిమా రెండు భాషల్లో తెరకెక్కించారు అయితే హిందీలోఈ చిత్రం విజయాన్ని అందుకుంది. అలాగే మహేష్ బట్ దర్శకత్వం లో వచ్చిన మిగతా సినిమాలు అంగారే, జక్మ్ లో కూడా నాగార్జున నటించాడు.

అయితే నాగార్జున ప్రస్తుతం మరో హిందీ చిత్రమైన 'బ్రహ్మాస్త్ర' లో నటిస్తున్నసంగతి అందరికి తెలిసిందే.ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, అలియా భట్, రణ్ బీర్ కపూర్ వంటి నటుల సరసన నాగార్జున నటిస్తున్నారు.ఇటీవలే తన పాత్రకు సంబందించిన షూటింగ్ ను కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో 'బ్రహ్మాస్త్ర' చిత్రం తెరకెక్కుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: