ఏ చిత్ర పరిశ్రమలో అయినా ఒక్క సినిమా చేయడనికి దర్శకులు, హీరోలు చాల కష్టపడుతుంటారు. కొన్ని సార్లు వాళ్ళ కష్టానికి ప్రతిఫలం రావొచ్చు.. కొన్ని సార్లు రాకపోవచ్చు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా దర్శకులు హీరోల మధ్య మంచి కాంబినేషన్ ఉంటుంది. ఆ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వచ్చిందటే సూపర్ హిట్ కావాల్సిందే. టాలీవుడ్ లో అలా మన స్టార్ హీరోలు కొందరు దర్శకులను పరిచయం చేశారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ‌ద్రి సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ తో తొలి సినిమా చేశాడు. ఆ తర్వాత తొలిప్రేమతో ‌కరుణాకరన్ ను ప‌వ‌న్ ఇండస్ట్రీకి ప‌రిచ‌యం చేశాడు. వంశీ పైడపల్లి, కొరటాల శివ ఇద్దరూ కూడా తెలుగు చిత్ర పరిశ్రమలోమంచి గుర్తింపు ఉన్న కమర్షియల్ దర్శకులు. మున్నా సినిమా ద్వారా వంశీ వచ్చి ఇప్పుడు అగ్ర దర్శకుడు అయ్యాడు. కొరటాల శివ మిర్చి సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైయ్యాడు.

ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ కి ఎంత క్రెజ్ ఉంటాదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి స్టూడెంట్ నెంబర్ 1 ద్వారా దర్శకుడు అయ్యాడు. ఆర్య సినిమా ద్వారా బన్నీ సుకుమార్ ని పరిచయం చేశాడు. సుకుమార్ కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం అది. ఇక ప్రేమించుకుందాం రా సినిమాతో జయంత్ ని వెంకటేష్ టాలీవుడ్ కి పరిచయం చేసాడు. వీళ్ళ కాంబో అనగానే చాలా మంది ఆశగా చూసేవాళ్ళు. ఆర్జీవీ, నాగార్జున కాంబో అనగానే శివా సినిమా గుర్తుకు వస్తుంది. ఈ సినిమా తర్వాత వర్మ కెరీర్ ఒక రేంజ్ లోకి వెళ్ళగా నాగార్జున యూత్ కి బాగా దగ్గరయ్యారు. వర్మను స్క్రీన్ కి నాగార్జున పరిచయం చేశారు. అది నాగార్జునకు కూడా తొలి సినిమా.

ఇక కోడీని చిరంజీవి టాలీవుడ్ కి పరిచయం చేశారు. ఇంట్లో రామయ్య వీధిలో క్రిష్ణయ్య సినిమా ద్వారా పరిచయం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో బోయపాటి శ్రీను అనగానే యాక్షన్ సినిమాలు మనకు గుర్తుకు వస్తాయి. భద్ర సినిమా ద్వారా టాలీవుడ్ లో అడుగుపెట్టాడు ఈ స్టార్ డైరెక్టర్. ఈ సినిమాలో రవితేజా హీరో. ఇక హరీష్ శంకర్ కూడా రవితేజ ద్వారానే వచ్చాడు. షాక్ అనే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: