తెలుగు ఇండస్ట్రీలో మహానటి సావిత్రి తర్వాత అంతటి గుర్తింపు తెచ్చుకున్న తారలు ఎవరైనా ఉన్నారా అంటే వెంటనే ప్రేక్షకులకు సౌందర్య గుర్తొస్తారు. అతి తక్కువ సమయంలోనే ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంది ప్రేక్షకాభిమానులను సంపాదించుకున్న హీరోయిన్లలో సౌందర్య ముందు వరుసలో ఉంటారు. ఇప్పటివరకు ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్లు వస్తున్నారు, వెళ్తున్నారు. కానీ సావిత్రి, సౌందర్య స్థానాన్ని ఏ ఒక్కరూ పూర్తి చేయలేదు. నటన ద్వారా పలు భాషలలో నటించి ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్న సౌందర్య అతి చిన్న వయసులోనే ఎవరికీ అందనంత దూరం అయ్యారు. అయితే ఎంతో మంది గుండెల్లో ఇప్పటికీ చెరగని స్థానం సౌందర్య సంపాదించుకున్నారు. ఇలాంటి హీరోయిన్ గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలను ఇక్కడ తెలుసుకుందాం...

సాధారణంగా ఏ యాక్టర్ ను పలకరించిన యాక్టర్ కాకపోయి ఉంటే డాక్టర్ అయ్యే దానిని అని చెబుతారు. అచ్చం సౌందర్య కూడా ఇండస్ట్రీలోకి రాకపోయి ఉంటే డాక్టర్ అయ్యేవారు. సౌందర్య ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం చదువుతున్న సమయంలో సినిమాలలో నటించే అవకాశం రావడంతో ఎంబీబీఎస్ పూర్తి చేయలేకపోయారు. కృష్ణ, వాణి విశ్వనాథ్ జంటగా నటించిన "రైతు భారతం" అనే సినిమాలో భానుచందర్ కి జోడిగా సౌందర్య నటించారు. తెలుగులో మొదటి సినిమా ఇదే.

రైతు భారతం తర్వాత మనవరాలు పెళ్లి, రాజేంద్రప్రసాద్ రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో నటించారు. ఈ సినిమా తరువాత సౌందర్య వెనుతిరిగి చూసుకోలేదు. వరుస అవకాశాలతో ఇండస్ట్రీలో టాప్ వన్ హీరోయిన్ గా నిలిచారు. తెలుగు స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మోహన్ బాబు వంటి హీరోల సరసన ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. తెలుగు ఇండస్ట్రీలో హిట్ పెయిర్ గా వెంకటేష్ ,సౌందర్య అని చెప్పవచ్చు.ఆరు సార్లు ఫిలిం ఫేర్ అవార్డ్, మూడు సార్లు నంది అవార్డ్ ని అందుకున్నారు.అమ్మోరు,అంత:పురం, పవిత్ర బంధం సినిమాలు సౌందర్యకు ఎంతో మంచి పేరు తెచ్చి పెట్టాయి.

ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న సౌందర్య సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయినటువంటి మేనమామ జిఎస్ రఘుని వివాహం చేసుకున్నారు.సౌందర్య నటించిన చివరి చిత్రం తెలుగులో శివశంకర్ కాగా, కన్నడలో ఆప్తమిత్రలో గంగ పాత్రలో నటించారు..ఈ సినిమాలో నటనకి గాను ఫిలింఫేర్ అవార్డు రాగా సౌందర్య మరణాంతరం వచ్చిన ఈ అవార్డుని తన భర్త రఘు అందుకున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: