సోగ్గాడు శోభన్ బాబు కి లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉండేది. అయితే మొదట్లో శోభన్ బాబు సినిమా అవకాశాల కోసం ఎర్రటి ఎండలో సైకిల్ పై తిరుగుతూ నానా కష్టాలు పడ్డారు. ఎలాగోలా సినీ అవకాశాలు చేజిక్కించుకొని అనతి కాలంలోనే స్టార్ హీరో అయ్యారు. ఆయన దాదాపు 200 సినిమాల్లో హీరోగా నటించారు. ఐతే తనకు సినిమాల నుంచి వచ్చిన రెమ్యూనరేషన్ డబ్బులను కేవలం భూములు కొనడానికి ఉపయోగించేవారు. భవిష్యత్తులో జనాభా విపరీతంగా పెరిగిపోతుందని.. అప్పుడు భూములకు డిమాండ్, విలువ బాగా పెరుగుతుందని శోభన్ బాబు మురళీమోహన్, జయలలిత వంటి నటీనటులతో చెప్పేవారు.

అలాగే ప్రముఖ సిటీలలో చాలా భూములను కొన్నారు. గతంలో ఆయన ఊహించినట్టుగానే భూముల విలువలు విపరీతంగా పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం ఆయనకు ఉన్న స్థిరాస్తుల విలువ రూ. 80 వేల కోట్లు అని అంటుంటారు. పేద కుటుంబం నుంచి వచ్చిన ఒక సినిమా హీరో రూ. 80 వేల కోట్లు సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. అయితే ఎంత సంపాదించినా శోభన్ బాబు పిల్లికి కూడా బిచ్చం పెట్టరని కొందరు అంటుంటారు. కానీ తన చుట్టూ ఉండే వారికి ఆర్థిక సహాయం చేయడం లో శోభన్ బాబు ఎప్పుడూ ముందుంటారని సన్నిహితులు చెబుతుంటారు.

అయితే శోభన్ బాబు కి డ్రైవర్ గా ఒక వ్యక్తి పని చేసేవాడు. పేరుకు డ్రైవరే అయినప్పటికీ అతడు శోభన్ బాబు కాళ్ళు కూడా నొక్కుతూ అన్ని పనులు చేసేవాడు. దీంతో వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. శోభన్ బాబు విచ్చలవిడిగా ఆ డ్రైవర్ కి డబ్బులు కూడా ఇచ్చేవారట. అయితే ఆ డబ్బుతోనే డ్రైవర్ కూడా కొన్ని భూములు కొనుగోలు చేశాడని.. ప్రస్తుతం వాటి విలువ కోట్లలో పలుకుతుందని తెలుస్తోంది. ఏది ఏమైనా శోభన్ బాబు మాత్రమే కాదు ఆయన డ్రైవర్ కూడా భూములను కొనుగోలు చేసి కోటీశ్వరుడయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: