ఒకప్పటి టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఇప్పటి హీరో సునీల్ సినిమా పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఇప్పుడు ఇంతటి స్టార్ గా ఎదిగాడు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతానికి చెందిన సునీల్ టాలీవుడ్ కి నువ్వేకావాలి సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత ఎన్నో పెద్ద సినిమాలలో కామెడీ పండిస్తూ స్టార్ కమెడియన్ అయ్యాడు. త్రివిక్రమ్ కు సన్నిహితుడైన సునీల్ ఆయన సహాయ సహకారాలతో ఇంతటి వాడయ్యాడు. ఆయన ఇచ్చిన కథ అందాల రాముడు మూవీ తో హీరో అయ్యాడు.

ఆ తర్వాత హీరోగానే సినిమాలు చేసుకుంటూ వచ్చి మంచి విజయాలు కూడా అందుకున్నాడు. కానీ కొన్ని సినిమాల తర్వాత సునీల్ సినిమాల ఎంపిక సరిగా లేకపోవడంతో హీరోగా తాను పనికిరాడని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి మంచి పాత్రలు చేసుకుంటూ వస్తున్నాడు. విలన్ గా సైతం సునీల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో హీరోగా కొన్ని ప్రాజెక్టులు ఉండగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా కమెడియన్ గా కూడా చేస్తూ ఆల్ రౌండర్ అనిపించుకుంటున్నాడు సునీల్.

కాలేజీ రోజుల్లోనే మెగా స్టార్ చిరంజీవికి పెద్ద అభిమాని అయిన సునీల్ ఆయన నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలోని సాంగ్స్ కి డాన్స్ చేసి చిరు నీ ఆరాధించేవాడు. చిన్నప్పుడే తండ్రి చనిపోగా అన్ని తల్లి చూసుకుని ఆయనను ఇప్పుడు ఇంతటి వాడిని చేసింది. సినిమాల్లో నటించాలనే కోరిక బలంగా ఉండటంతో జాబ్ చేయవద్దు అని చెప్పి తన దగ్గర ఉన్న బైక్ అమ్మి సినిమా అవకాశం కోసం హైదరాబాద్ వచ్చాడు. ఆ తరువాత సునీల్ ప్రభంజనం అందరికీ తెలిసిందే. 2002లో పెద్దల అంగీకారంతో ఆయన ఇందుకూరి శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా కుందన కూతురు, దుష్యంత్ అనే కొడుకు ఉన్నారు. 
సునీల్ హీరోగా ఓ సినిమాకు 70 లక్షల వరకు తీసుకుంటున్నాడు. 40 కోట్ల వరకు సునీల్ సంపాదించగా ప్రశాంత్ నగర్ జూబ్లీహిల్స్ లో ఖరీదైన ఇల్లు, రెండు కార్లు ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: