మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య థియేట‌ర్ల‌లోకి ఎప్పుడు వ‌స్తుందా ? అని తెలుగు సినీ జ‌నాలు క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే చిరు న‌టించిన సైరా న‌ర‌సింహా రెడ్డి థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి రెండేళ్లు దాటుతోంది. మ‌రో వైపు కొర‌టాల శివ అప్పుడెప్పుడో నాలుగేళ్ల క్రితం మ‌హేష్ బాబుతో భ‌ర‌త్ అనే నేను సినిమా తీశారు. అప్ప‌టి నుంచి అటు కొర‌టాలు, ఇటు చిరు ఇద్ద‌రిస సినిమాలు రిలీజ్ కాలేదు. పైగా వీరిద్ద‌రి కాంబినేష‌న్లో వ‌స్తోన్న సినిమా కావ‌డంతో పాటు అటు చ‌ర‌న్ కూడా కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండ‌డంతో ఈ సినిమా ఎలా ?  ఉంటుందా ? అన్న ఆస‌క్తి అయితే అంద‌రిలోనూ ఉంది.

రెండేళ్లుగా ఊరిస్తూ వ‌స్తోన్న ఈ సినిమా ఈ ద‌స‌రాకు అయినా రిలీజ్ అవుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. అస‌లు ముందు ఈ యేడాది సంక్రాంతి అనుకున్నారు. క‌రోనా దెబ్బ‌కు స‌మ్మ‌ర్‌లో ఎలాగైనా రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. క‌రోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండ‌డంతో స‌మ్మ‌ర్‌కు కూడా రాలేదు. ఇక ఇప్పుడు ద‌స‌రాకు క‌ష్ట‌మే అని తెలుస్తోంది. ద‌స‌రాకు ఆర్ ఆర్ ఆర్ ఉంది. ఆ సినిమాకు పోటీగా వెళ్లే సాహ‌సం ఈ సినిమా చేయ‌దు. పోనీ వ‌చ్చే సంక్రాంతికి అయినా వ‌స్తుందా ? అనుకుంటే క‌ష్ట‌మే అంటున్నారు. ఎందుకంటే వ‌చ్చే సంక్రాంతికి స‌ర్కారు వారి పాట‌, ప‌వ‌న్ - రానా సినిమా ఉన్నాయి.

ఇక వెంకీ ఎఫ్ 3 కూడా వ‌చ్చే సంక్రాంతికే అంటున్నారు.  ప్రభాస్ రాధే శ్యామ్ సంక్రాంతి కోసం లాక్ చేసి పెట్టారు. ఇన్ని సినిమాల పోటీలో ఆచార్య సంక్రాంతికి ఖ‌చ్చితంగా రాదు. ఇక పుష్ప‌, ల‌వ్‌స్టోరీ కూడా ద‌స‌రా త‌ర్వాత ఉన్నాయి. ఏదేమైనా వ‌చ్చే సంక్రాంతి త‌ర్వాత అంటే ఏ ఫిబ్ర‌వ‌రిలోనో లేదా స‌మ్మ‌ర్లో మాత్ర‌మే ఈ సినిమా రిలీజ్ చేసుకోవాల్సిందే త‌ప్పా.. అంత‌కు మించి ఆప్ష‌న్ లేదు. ఏదేమైనా మెగా ఫ్యాన్స్‌కు మాత్రం ఇది బ్యాడ్ న్యూసే అని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: