టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ఒక అనామక నటుడిగా వచ్చి ఇప్పుడు స్టార్ నటుడిగా మారాడు మేకా శ్రీకాంత్. తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పటి వరకు 125 సినిమాలలో నటించి హీరోగా, సహాయక నటుడిగా, నిర్మాతగా కూడా మారి పలు సినిమాలను తెరకెక్కించాడు. ఆయన హీరోగా నటించిన విరోధి అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరించి నిర్మాతగా మంచి సక్సెస్ ను అందుకున్నాడు. తెలుగు సినిమా నటుల సంఘం మా అసోసియేషన్ లో సభ్యుడిగా పనిచేసిన ఈయన హీరోయిన్ ఊహా ను వివాహం చేసుకోగా వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.

ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన పీపుల్స్ ఎన్ కౌంటర్ అనే ఈ సినిమా ద్వారా దర్శకుడిగా తొలి అవకాశం అందుకున్న శ్రీకాంత్ ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. తన మొదటి సినిమాకి ఐదు వేల రూపాయలు మాత్రమే అందుకున్న శ్రీకాంత్ ఇప్పుడు లక్షల్లో పారితోషకం అందుకోవడం విశేషం. మొదట్లో చిన్న పాత్రలతో, విలన్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన శ్రీకాంత్ నెమ్మదిగా వన్ బై టూ అనే సినిమా తో హీరోగా మొదటి సినిమా చేశాడు.  ఆ సినిమా మంచి ఫలితాన్ని ఇవ్వకపోయినా ఆ తర్వాత చేసిన తాజ్ మహల్ సినిమా మంచి విజయం కావడంతో హీరోగా నిలదొక్కుకొగలిగాడు.

ఇక కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి సినిమా ఆయన కెరీర్ ను పూర్తిగా మార్చివేసింది అని చెప్పవచ్చు. అప్పట్లో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సినిమా అవకాశాలు దక్కించుకున్నాడు శ్రీకాంత్. ఖడ్గం, ఆపరేషన్ దుర్యోధన సినిమా లలో ఆయన నటించిన నటనకు మంచి ప్రశంసలు లభించాయి. చిరంజీవి అభిమానిగా సినిమా పరిశ్రమలోకి వచ్చిన శ్రీకాంత్ ఆయనతో కొన్ని సినిమాల్లో కలిసి నటుడిగా నటించి ఇప్పటి సీనియర్ స్టార్ హీరోలందరితో కలిసి నటించిన నటుడిగా రికార్డు సృష్టించాడు. తనకంటే చిన్న స్థాయి నటులతో సైతం కలిసి నటించే మంచి వ్యక్తిత్వం ఉన్న నటుడు శ్రీకాంత్. ప్రస్తుతం విలన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  బాలకృష్ణ నటించిన అఖండ సినిమాలో ఆయన విలన్ గా చేస్తున్నాడు. అంతే కాకుండా ఇతర సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా చేస్తున్నాడు శ్రీకాంత్.

మరింత సమాచారం తెలుసుకోండి: