తెలుగు సినిమా పరిశ్రమలో సింగర్స్ కు ఉన్న ప్రత్యేకత వేరు అని చెప్పాలి. ఒక సినిమాను ప్రేక్షకుడు ఎంజాయ్ చేయాలంటే అందులో అన్ని అంశాలు సమాన ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. అందులో మ్యూజిక్ ఒకటి. కథకు తగ్గట్టు చక్కని మ్యూజిక్ తోడైతే సినిమా విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఈ పాటలకు సంగీతాన్ని అందించేది మ్యూజిక్ డైరెక్టర్ అయినా, వాళ్ళు స్వరపరిచిన పాటలకు ఒక గాత్రాన్ని అందించి ప్రాణం పోసేది మాత్రం సింగర్. ఎంత మంచి భావాలు కలిగిన పాట అయినా ప్రజల్లోకి వెళ్లాలంటే సింగర్ సరిగా పాడితేనే, అందుకే ఏ పాటలకు ఎటువంటి సింగర్ అయితే బాగుంటుంది అని సెలక్ట్ చేసుకుంటూ ఉంటారు సంగీత దర్శకులు.

మనకు టాలీవుడ్ లో ఎందరో సింగర్ లు ఉన్నారు. వాటిలో ఒకరి గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం. అలాంటి సింగర్ లలో ఒకరే శ్రీరామ చంద్ర. ఈ యువ సింగర్ 2005 నుండి పాటలు పాడుతున్నా రాని గుర్తింపు ఒక సింగింగ్ కాంపిటీషన్ ద్వారా దేశ వ్యాప్తంగా మంచి పేరును తెచ్చుకున్నాడు. ఇండియన్ ఐడియల్ సింగర్ 2010 షో లో విజయాన్ని సాధించడం ద్వారా వెలుగులోకి వచ్చాడు. సంగీత నేపథ్యం లేని కుటుంబం అయినప్పటికీ శ్రీ రామ చంద్ర సంగీతంలో ప్రావీణ్యం సంపాదించాడు. ఇది అంతా కూడా తన మామ వెంకటాచలం వలనే అని చాలా ఇంటర్వ్యూ లలో రామచంద్ర తెలిపారు.  వెంకటాచలం గారు లేకుంటే మనకు శ్రీరామ చంద్ర లాంటి మంచి సింగర్ ఉండేవాడు కాదేమో.  

ఇతని పాడిన పాటలు ఎంతో మందిని మంత్ర ముగ్ధుల్ని చేశాయి. ఇండియన్ ఐడియల్ సింగర్ 2010 సమయంలో సంజయ్ దత్, జాన్ అబ్రహం, బిపాసా బసు, కత్రినా, ప్రియాంక చోప్రా లాంటి బాలీవుడ్ సెలబ్రిటీలు ఈయన పాటలకు ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఈయన పాడిన పాటలలో తీన్మార్ లో "గెలుపు తలుపులే తీసే ఆనందమే వీడని బంధమే..." సాంగ్ మంచి పేరును తీసుకు వచ్చింది. శ్రీరామ్ మణిశర్మ, రమణ గోగుల మరియు కళ్యాణి మాలిక్ లాంటి సంగీత దర్శకుల సారధ్యంలో పాటలు పాడాడు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్ గా ఉన్నాడు. ముందు ముందు ఇంకా మంచి సినిమాలలో పాటలు పాడి మనల్ని అలరించాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: