అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్, రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు ఈ ముద్దుగుమ్మ నటనకు, అంద చందాలకు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కడంతో టాలీవుడ్ లో కీర్తి సురేష్ కు ఫుల్ క్రేజ్ వచ్చింది. అయితే ఆ తర్వాత  నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటి సినిమాతో కీర్తి సురేష్ ఎంతో మంది ప్రశంసలు పొంది గొప్ప నటిగా పేరు తెచ్చుకుంది. అయితే ఆ తర్వాత కీర్తి సురేష్ టాలీవుడ్  స్టార్ హీరోల సరసన నటించి అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది. కీర్తి సురేష్ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషా సినిమాల్లో కూడా నటించి అక్కడ కూడా మంచి గుర్తింపును తెచ్చుకుంది, కీర్తి సురేష్ కేవలం కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం మాత్రమే కాకుండా తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమా నేరుగా ఓటిటి లో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. తమిళంలో కీర్తి సురేష్ 'సానికాయిదం' అనే సినిమా చేసింది. దర్శకుడు సెల్వ రాఘవన్ కూడా ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రను చేశాడు. అప్పుడెప్పుడో ఈ మూవీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఆ తర్వాత మళ్లీ ఈ మూవీ ఊసే లేదు.. తాజాగా ఈ సినిమాను డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేయనున్నారని తెలుస్తుంది. ఈ సినిమా ఓటిటి హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సినిమా స్ట్రీమింగ్ తేదీని విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే కీర్తి సురేష్ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న బోలా శంకర్ సినిమాలో చిరంజీవి కి చెల్లెలిగా నటిస్తోంది, అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలు కీర్తి సురేష్, మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: