హాట్ బ్యూటీ రాశీ ఖన్నా ఎంత పెద్ద అందగత్తో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందంతో అమ్మడు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కాని ఎప్పుడూ కూడా మరీ అంతా రెచ్చిపోయి అందాలు ఆరబోయ్యలేదు.ఇక 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా తర్వాత రాశీ ఖన్నాకి ఛాన్స్ లు తగ్గినట్టు కనిపించాయి.దాంతో ఈ ముద్దు గుమ్మ వరుసగా హాట్ ఫోటో షూట్లలో పాల్గొంటూ వచ్చింది.ఇక దాని ఎఫక్టే అనుకుంట.. ఈ చిన్న దానికి  ఆ తర్వాత నుండీ వరుస అవకాశాలు క్యూలు కడుతూ వచ్చాయి.గోపీచంద్ తో `పక్కా కమర్షియల్`సినిమా అలాగే ,నాగ చైతన్య `థాంక్యూ` సినిమాల్లో ఛాన్స్ లు కొట్టిన రాశి..ఇక అటు తర్వాత తమిళంలో `సర్దార్`, `తిరుచిత్రాంబలం`, `మేధావి`, `సైతాన్ కా బచ్చా` లాంటి సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది.ఇక అలాగే వీటితో పాటు హిందీలో కూడా `యోధ` మూవీ …ఇంకా రెండు వెబ్ - సిరీస్ లతోనూ బిజీగా గడుపుతూ వస్తోంది. ఇవి చాలవన్నట్టు ఇప్పుడు ఈ అమ్మడి ఖాతాలో జై లవకుశ తరువాత కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ లాంటి పెద్ద హీరో సినిమా వచ్చి పడింది.

'మహర్షి' సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లి తమిళ స్టార్ హీరో విజయ్ తో ఓ బైలింగ్యువల్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాకి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాత.ఇక విజయ్ కు కోలీవుడ్ లో రూ.200కోట్ల మార్కెట్ అనేది ఉంది. తెలుగులో మాత్రం రూ.15 కోట్ల మార్కెట్ ఏర్పడింది. కాబట్టి ఇలాంటి స్టార్ హీరో పక్కన నటించే అవకాశం రాశీ ఖన్నాకి రావడం అంటే చాలా పెద్ద విషయం . ఈమె కెరీర్ చూసుకుంటే ఇప్పటి దాకా ఒక్క ఎన్టీఆర్ తో తప్ప మరో స్టార్ హీరోతో జతకట్టింది లేదు. హీరో విజయ్ తో చేస్తున్న ఈ మూవీ కనుక వర్కౌట్ అయితే రాశీ ఖన్నాకి ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కడం అనేది ఖాయం. మొత్తానికి విప్పి చూపించి అందాలు ఆరబోస్తే కాని ఈ బ్యూటీకి ఆఫర్లు అనేవి తలుపు తట్టడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: